- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంగన్వాడీలను సద్వినియోగం చేసుకోండి: ఎంపీ రఘునందన్ రావు
గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.

దిశ, నిజాంపేట: గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. రామాయంపేటలో నిర్వహించిన పోషణ పక్వాడ కార్యక్రమానికి ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే రోహిత్ రావు ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. ప్రతి అంగన్వాడి కేంద్రంలో తప్పనిసరిగా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సూచించారు. కిచెన్ గార్డెన్లలో ఆకుకూరలు పెంచి చిన్నారులకు పోషకాహారం అందించాలని తెలిపారు. అలాగే ప్లాస్టిక్ నిర్మూలనపై అంగన్వాడి కేంద్రాల నుంచే అవగాహన కల్పించాలని, విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే పర్యావరణ పరిరక్షణ భావన పెంపొందించాలని అన్నారు. క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమయ్యే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న నృత్యాలు...
కేంద్ర ప్రభుత్వం ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు అంగన్వాడి కేంద్రాల ద్వారా పోషకాహార పదార్థాలు అందిస్తున్నట్లు తెలిపారు. పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన చిరుధాన్యాల ప్రదర్శనను ఎంపీ, ఎమ్మెల్యేలు పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. అనంతరం గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ప్రీ-స్కూల్ పూర్తి చేసిన విద్యార్థులకు ఎమ్మెల్యే రోహిత్ రావు సర్టిఫికెట్లు, మెడల్స్, మెమొంటోలు అందజేశారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. తహసిల్దార్ రజని కుమారి, సీడీపీవో స్వరూప రాథోడ్, ప్రగతి ధర్మారం పీహెచ్సీ డాక్టర్ వైశాలి, ఎంపీడీవో షాజీలోద్దీన్, కౌన్సిలర్ శంకర్ గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మానేగాళ్ళ రామకృష్ణయ్య తదితరులు ఉన్నారు.






