- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లక్కు.. కిక్కు దక్కేదెవరికో..! నేడే మద్యం షాపులకు లక్కీ డ్రా
మద్యం షాపుల లక్కీ డ్రా కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

దిశ, సంగారెడ్డి బ్యూరో: మద్యం షాపుల లక్కీ డ్రా కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 2023-2025 మద్యం పాలసీ ప్రకారం దుకాణాల లైసెన్స్‌ల కేటాయింపు కోసం సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీయనున్నారు. ఈ నెల 4 వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని 243 వైన్స్‌లకు 8,634 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తులకు ప్రభుత్వం రూ.3లక్షలు ఫీజు పెట్టిన విషయం తెలిసిందే. ఈ ఫీజు తిరిగి ఇవ్వరు ఈ క్రమంలో దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.259.02 కోట్ల ఆదాయం వచ్చింది. రెండేళ్ల గడువుతో వైన్స్ కేటాయిస్తున్నారు. కాగా గత 2023,25లో మొత్తం 12,227 దరఖాస్తులు వచ్చాయి. అప్పుడు ఫీజు రూ.2 లక్షలు ఉండడంతో సర్కారుకు రూ.244.54 ఆదాయం వచ్చింది. ఈ లెక్కన ఫీజు పెంపుతో దరఖాస్తుల సంఖ్య 3,593 తగ్గినప్పటికీ ఆదాయం మాత్రం రూ.14.48కోట్ల ఆదాయం పెరిగింది. కాగా ఈ నెల 27న జిల్లా కలెక్టర్ల సమక్షంలో వైన్స్ లకు డ్రాలు తీయనున్నారు. నెంబర్ కన్ఫ్యూజ్ కాకుండా అధికారులు ప్రత్యేక గుర్తులు గల టోకెన్లు ఏర్పాటు చేశారు.
సెల్ ఫోన్‌లను హాల్‌లోకి అనుమతి లేదు..
సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లా కేంద్రాల్లో మద్యం షాపుల లక్కీ డ్రా ప్రక్రియ ఉదయం 11 గంటల నుంచి లక్కీ డ్రా ప్రారంభం కానుంది. దరఖాస్తులు దారులు రిసిప్ట్, ఎంట్రీ పాస్ తో ఉదయం 9 గంటల లోపు వేదికకు చేరుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. హాల్ లోకి మొబైల్ ఫోన్ లకు అనుమతి లేదు. ఎంపికైన దరఖాస్తు దారులు అదే రోజు గానీ, మరుసటి రోజు గానీ షాప్ ఎక్సైజ్ పన్ను మొదటి వాయిదాను చెల్లించి షాపు కేటాయింపు నిర్ధారణ లేఖ తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
సిండికేటై టెండర్లు...
స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో మద్యం షాపులు దక్కించుకునేందుకు కొందరు సిండికేటై టెండర్లు వేశారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడం యువకులు, వ్యాపారులు మద్యం వ్యాపారం పై పలువురు కన్నేశారు. ఈ క్రమంలో ఆయా డబ్బాల్లో ఉన్న దరఖాస్తుల్లో ఎవరికి లక్కు దక్కనున్నదో చూడాల్సి ఉన్నది. అయితే పలు చోట్ల గ్రూపుగా ఏర్పడి ఎక్కవగా దరఖాస్తులు వేసుకున్నారు. గ్రూపుగా కావడంతో పాటు ఫీజు పెంపు కారణంగా దరఖాస్తులు తగ్గినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.
మెదక్ జిల్లా 49 మద్యం షాపులు..
మెదక్ జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వర గార్డెన్స్‌లో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో డ్రా తీసి షాప్ లను ఎంపిక చేయనున్నారు. మెదక్ జిల్లాలో 49 మద్యం షాప్ లు మూడు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో ఉన్నాయి. గత నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో భాగంగా జిల్లాలోని ఎక్సైజ్ ఈ ఎస్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. మొదట ఈ నెల 18వరకు దరఖాస్తుల గడువు ఉండగా మళ్లీ 23వరకూ తేదీలు పెంచి మరింత గడువు ఇచ్చింది. 49 షాప్ లకు 1420 దరఖాస్తులు వచ్చాయి. ప్రతి దరఖాస్తు నుంచి రూ.3లక్షల డీడీ, చాలన్ చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో షాపునకు వచ్చిన దరఖాస్తుల్లో డ్రా తీసి లక్కీ లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. ఒక్కో షాపు కు వచ్చిన దరఖాస్తులకు నంబర్లు కేటాయించి అందులో ఒక నంబరును కలెక్టర్ తీసి ప్రకటిస్తారు. ఇలా 49 షాప్ లకు అదే పద్ధతిగా లక్కి లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి షాప్ లు కేటాయిస్తారు. అత్యంత పారదర్శకంగా మద్యం లాటరీ ప్రక్రియ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మద్యం షాప్ ల కేటాయింపు పారదర్శకంగా నిర్వహిస్తామని అన్నారు. ఆదివా రం మెదక్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్, బోధన్ రోడ్, మెదక్ ఫంక్షన్ లాటరీ నిర్వహణ ఏర్పాటులను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2025 - 27 సంవత్సరాలకు మెదక్ జిల్లా లోని ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మద్యం షాపుల దరఖాస్తు ప్రక్రియ 23న ముగిసిందని తెలిపారు.మెదక్ జిల్లాలోని మొత్తం (49) మద్యం షాపులకు గాను (1420) దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. దరఖాస్తు ఫీజు రూపంలో 42 కోట్ల 60 లక్షల రూపాయల ఆదాయం ఆర్జించడం జరిగిందన్నారు. 27 సోమవారం రోజున మద్యం షాపుల కేటాయింపుకు సంబంధించిన లాటరీ ప్రక్రియ ను మెదక్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్, బోధన్ రోడ్, మెదక్ ఫంక్షన్ హాల్ నందు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు నిర్వహించడం జరుగుతుందన్నారు. మెదక్ జిల్లాలోని మద్యం షాపులకు దరఖాస్తు చేసిన దరఖాస్తుదారులు, ఆర్థరైజ్డ్ రెప్రెసెంటేటివ్ 27 సోమవారం రోజున ఉదయం 9.30 గంటల వరకు శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్ నందు హాజరు కావాలన్నారు. దరఖాస్తుదారులు లేదా ఆర్థరైజ్డ్ రెప్రెసెంటేటివ్ ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి వారు దరఖాస్తు చేసిన సమయంలో వారికి ఇచ్చినటువంటి రసీదు ఎంట్రీ పాస్ ఒరిజినల్ ను తీసుకొని హాజరు కావాల్సి ఉంటుందని కోరారు. కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






