నీటి ట్యాంక‌ర్ వాహ‌నాన్ని ఢీ కొట్టిన లారీ.. వ్య‌క్తికి తీవ్ర గాయాలు

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, కొండ‌పాక : రాజీవ్ రహదారిపై చెట్లకు నీరు పోస్తున్న నీటి ట్యాంకర్ వాహనాన్ని కోళ్ల ఫీడ్ లోడుతో వెళ్తున్న లారీ ఢీ కొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ సంఘటన కొండపాక శివారులోని గౌరాయపల్లి

నీటి ట్యాంక‌ర్ వాహ‌నాన్ని ఢీ కొట్టిన లారీ.. వ్య‌క్తికి తీవ్ర గాయాలు
X

దిశ‌, కొండ‌పాక : రాజీవ్ రహదారిపై చెట్లకు నీరు పోస్తున్న నీటి ట్యాంకర్ వాహనాన్ని కోళ్ల ఫీడ్ లోడుతో వెళ్తున్న లారీ ఢీ కొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ సంఘటన కొండపాక శివారులోని గౌరాయపల్లి స్టేజి వద్ద రాజీవ్ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన స‌మాచారం మేర‌కు.. రాజీవ్ రహదారి పక్కన ఉన్న చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్ వాహనాన్ని హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు అతివేగంగా వెళ్తున్న లారీ ఢీ కొట్టడంతో రోడ్డుకు కిందకు దూసుకెళ్లి చెట్టుకు ఢీ కొట్టింది. దీంతో లారీ డ్రైవర్ ప్రవీణ్ అందులోనే ఇరుక్కుపోయి తీవ్ర గాయాలకు గురయ్యాడు. సమాచారం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది మహేందర్, రమేష్ చేరుకొని లారి నుంచి డ్రైవర్ ను బయటకు తీసి ప్రథమ చికిత్స చేసి అంబులెన్స్ లో సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Next Story