క్రీడా స్ఫూర్తితో జీవితాన్ని గెలవాలి : సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్

by Ratna Kumari |

ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో జీవితాన్ని గెలవాలని సర్పంచ్, స్పాన్సర్ కంజర్ల చంద్రశేఖర్ అన్నారు.

క్రీడా స్ఫూర్తితో జీవితాన్ని గెలవాలి : సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్
X

దిశ, చిన్నశంకరంపేట : ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో జీవితాన్ని గెలవాలని సర్పంచ్, స్పాన్సర్ కంజర్ల చంద్రశేఖర్ అన్నారు. అలాగే శేరిపల్లి లో సంక్రాంతి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ని కాంగ్రెస్ నాయకులు చిన్న కృష్ణ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా 10 జట్లు పాల్గొంటుండగా.. టాస్ వేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. సంక్రాంతి ముగ్గుల పోటీలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ మూడు రోజులపాటు పండుగ వాతావరణం లో భాగంగా యువకులు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసుకొని ఆడడం వారి శారీర ధృడ‌త్వానికి ఎంతో ద్వాద పడతాయన్నారు. ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతి మేడిమాలతికి బహుమతి అందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భాను ప్రసాద్, కావ్య సంతోష మల్లేశం బహుమతులు అందించారు. అలాగే శేరిపల్లిలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు జంగర్ల గోవర్ధన్, జర్నలిస్ట్ చంద్రం గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రమేష్, వెంకట్ ఆర్గనైజర్ పాల్గొన్నారు.

Next Story