మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు..

by Kodari Anjali |

ఓ మహిళను హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు 25 వేల జరిమానా విధించింది.

మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు..
X

దిశ, నర్సాపూర్: ఓ మహిళను హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు 25 వేల జరిమానా విధిస్తూ పీడీజె మెదక్ కోర్టు సోమవారం సంచలన తీర్పును వెలువరించింది. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఎల్లారెడ్డి గూడ తండా గ్రామపంచాయతీ పరిధిలోని జయరాం తాండకు చెందిన మెగావత్ భుజాలి (52) నర్సాపూర్ మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాల క్రితం హత్యకు గురికావడం జరిగింది. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా మహబూబానగర్ జిల్లా, అయ్యగారి పల్లి తండా గ్రామపంచాయతీకి చెందిన కేతావత్ గోపాల్ (54) గా గుర్తించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను పరిశీలించిన పిదప మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ నిందితుడికి సోమవారం సోమవారం జీవిత ఖైదుతో పాటు 25 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ కేసును చేదించడంలో, నిందితుడికి శిక్ష పడడంలో పీపీ టి. వెంకటేష్, డీఎల్ ఆఫీసర్లు విట్టల్, ఎఫ్ ఐ ఆర్ ఇష్యూడ్ ఎస్సై లింగం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సీఐ జాన్ రెడ్డి, ప్రస్తుత ఎస్ హెచ్ ఓ రంగా కృష్ణ సీఐ, సీడీఓ హరిబాబు గౌడ్ సహాయ సహకారాలు అందజేశారు.

Next Story