- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎవరో ఇక తేల్చుకుందాం.. ‘గూడెం’ను వదిలిపెట్టే ప్రసక్తేలేదు : కాట శ్రీనివాస్ గౌడ్
పటాన్ చెరులో ఇక మీరో..నేనో తేల్చుకుందామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు.

దిశ, రామచంద్రాపురం : పటాన్ చెరులో ఇక మీరో..నేనో తేల్చుకుందామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. మంగళవారం మీడియా సమావేశంలో మహిపాల్ రెడ్డి శ్రీనివాస్ పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆరోపణలపై కాటా తీవ్రంగా స్పందించారు. అశోక్ నగర్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
ఆరోపణలు నిరూపిస్తే తలనరుక్కుంటా..
తన పై గూడెం మహిపాల్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపిస్తే తల నరుక్కుంటానని కాటా శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదు.. దమ్ముంటే నిజాలు మాట్లాడాలన్నారు. ఇన్ని రోజులుగా తాను ఓపిక పట్టానని ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆయన అడ్డదారిలో గెలిచారని, అతని గురించి మాట్లాడే అర్హత నాకు లేదా? నీకు లేదా? అని ఎద్దేవా చేశారు. 10 రోజుల ముందు టికెట్ వస్తేనే మీకు మూడు చెర్ల నీళ్లు తాగించామని, మూడు నెలల ముందు బీఫామ్ తెచ్చుకొని ఎన్ని ఓట్లతో గెలిచావో చూస్కో అన్నారు. అవినీతి, అక్రమ సంపాదన మీదా..? నాదా..? ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుందామా..? అని సవాల్ విసిరారు. ఆరోపణలు చేసే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని, లేదంటే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ రాకుండా పోతావ్ అని ఎద్దేవా చేశారు. దమ్మూ, ధైర్యం ఉంటే, రోజు తినేది అన్నమే అయితే శివాలయంలోకి తడి బట్టలతో రావాలని శ్రీనివాస్ గౌడ్ సవాల్ చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు తాను వస్తున్నానని, నిజాయితీ పరుడవైతే రా తేల్చుకుందాం అన్నారు. తనపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లింగమయ్య కాలనీ లాంటి కాలనీలు తమ కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్నాయంటే మా చరిత్ర తెలుసుకోవాలన్నారు. మీలాగా అన్నం పెట్టినోడికి సున్నం పెట్టే సంస్కారం మాది కాదన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కబ్జాదారులకి మద్దతు ఇస్తూ తనపేరు పోగొట్టుకోవద్దని కాటా శ్రీనివాస్ గౌడ్ హితవు పలికారు.ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పక్కన ఒక్క తెలంగాణ ఉద్యమ కారుడైనా ఉన్నాడా..? కబ్జాదారులను వెనకేసుకుని తిరిగే చరిత్ర ఆయనదని తీవ్ర విమర్శలు చేశారు.
ఆరోపణలు నిరూపిస్తావా..?
తనపై చేసిన ఆరోపణల్లో ఒక్కదానినైనా ఆధారాలతో నిరూపించాలని కాటా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సవాల్ విసిరారు. మున్సిపల్ టికెట్లను రూ.7 కోట్లకు అమ్ముకున్నానని, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవికి రూ.40 లక్షలు తీసుకున్నానని చేసిన ఆరోపణలను రుజువు చేయగలవా..? అని ప్రశ్నించారు. టికెట్లు పొందిన వారే ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని మీడియా ముందే స్పష్టం చేసినప్పుడు, తనపై డబ్బులు తీసుకున్నట్లు ఎలా ఆరోపణలు చేస్తారని కాటా నిలదీశారు. సర్పంచ్ పదవి మీ వల్లే పోయింది. తాను నియోజకవర్గం లో ఎమ్మెల్యే గా పోటీ చేస్తానని భయపడి పార్టీ మారాలని ఒత్తిడి తెలేరా..? మారకపోయే సరికి తన సర్పంచ్ పదవిని కక్ష కట్టి తీయించారన్నారు. నా కుటుంబంలోని మహిళలను అడ్డం పెట్టుకుని విమర్శలు చేయించడం సరికాదన్నారు.తమ కుటుంబ సభ్యులపై దిగజారే వ్యాఖ్యలు చేయనన్నారు.
కనీస అవగాహన లేని అసమర్థ ఎమ్మెల్యే గూడెం : కాట శ్రీనివాస్ గౌడ్
మహిపాల్ రెడ్డి అక్రమ మైనింగ్ పై అవగాహన లేకుండా అవాస్తవాలు మాట్లాడుతున్నారని, 2009లో చనిపోయిన అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి 2012లో ఎలా క్రషర్ కేటాయించారని ఎద్దేవా చేశారు. కోర్టుకి వెళ్లాం... ఇంకా కేస్ నడుస్తుంది మేము దోషులం ఎలా అవుతాం అంటున్నారు కదా..? ఈడీ ఎందుకు ఫెనాల్టీ వేసిందని ప్రశ్నించారు. దోషులే ఫెనాల్టీ కడతారని, మరి నువ్ ఎందుకు కట్టావన్నారు..? అక్రమ సంపాదన అని తెలిసాకే మీ ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని, సోదరుడు మధుసూదన్ రెడ్డిని జైల్ కి పంపిందని గుర్తు చేశారు. మార్కెట్ కమిటీలో షెటర్లు లేకున్న ఒక్కో లైసెన్సు రూ.25 లక్షలకు అమ్ముకుని రూ. 25 కోట్ల అవినీతికి పాల్పడింది మీరు కాదా అని శ్రీనివాస్ గౌడ్ సూటిగా ప్రశ్నించారు. శంకర్ లాల్ వ్యక్తికి 62 సర్వే నెంబర్ లో భూమి అమ్మి 64,65 సర్వే నెంబర్లు ఎందుకు వేశావో ప్రజలకు చెప్పే దమ్ముందా.. ? 62 సర్వే నెంబర్ లో పార్క్ స్థలాలను కబ్జా చేయలేవా..? అన్నారు. ఇంద్రేశం శివారులో 452 సర్వే నెంబర్ లో 1.12 గుంటలు అమ్మడానికి ప్రయత్నం చేయలేవా..? పోచారం లో 178 సర్వే నెంబర్ లో బై నంబర్స్ వేసి అక్రమంగా అమ్మలేవా..? కంజర్లలో ప్రభుత్వ భూములను చెరపట్టలేదా..? అమీన్ పూర్ చక్రపురి కాలనిలో 200 ఫీట్ల రోడ్ నిర్మాణం లో 5000 గజాల ఆక్రమణకు ప్రయత్నం చేయలేవా..? కంజర్లతో పాటు నియోజక వర్గంలో ఎన్నో స్థలాలను దోచేయలేదా.. ? వీటన్నింటికి ఆధారాలు బయటపెడుతానని మహిపాల్ రెడ్డిని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా రాణి, పఠాన్ చెరు వ్యవసాయ మార్కెట్ ఛైర్మెన్ శివానందం, వైస్ ఛర్మెన్ రాజశేఖర్, అమీన్ పూర్ మండల్ కాంగ్రెస్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి జయమ్మ,శోభ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.






