దుబ్బాక కాంగ్రెస్ లో నాయకత్వ లోపం !

by velandi.Saikiran |   (  Updated:2026-01-10 22:00:39  IST  )

దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామాల్లో సమర్థవంతమైన కాంగ్రెస్ క్యాడరున్నా కార్యకర్తలకు భరోసా ఇచ్చే లీడర్ షిప్ లేదు.

దుబ్బాక కాంగ్రెస్ లో నాయకత్వ లోపం !
X

దుబ్బాక కాంగ్రెస్ లో నాయకత్వ లోపం

= క్యాడరున్నా సమర్థుడైన లీడర్ లేడు

=కార్యకర్తలను పట్టించుకోని చెరుకు

= అయోమయంలో ఆ పార్టీ శ్రేణులు

=చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేరుకే ఇన్ చార్జి

=పంచాయతీ ఎన్నికల్లో పేలవమైన తీరు

=కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో ఉన్నా.. దుబ్బాకలో లేనట్లే.?

= అధిష్ఠానం దుబ్బాకపైదృష్టి సారిస్తుందా?

= పంచాయతీల్లో అలా.. మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగిరేనా?

దిశ, దుబ్బాక: దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామాల్లో సమర్థవంతమైన కాంగ్రెస్ క్యాడరున్నా కార్యకర్తలకు భరోసా ఇచ్చే లీడర్ షిప్ లేదు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పేలవమైన పని తీరును మూటకట్టుకుంది. దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 112 గ్రామ పంచాయతీలు ఉండగా దుబ్బాక మండలంలో 21గ్రామ పంచాయతీలుండగా ఇందులో 13పంచాయతీలను బీఆర్ఎస్ గెలుచుకోగా, బీజేపీ మూడు పంచాయతీలపై పాగా వేయగా, కాంగ్రెస్ పార్టీ కేవలం 5 గ్రామ పంచాయతీలను మాత్రమే దక్కించుకుంది. అక్బర్ పేట భూంపల్లి 19 గ్రామ పంచాయతీలు ఉండగా బీఆర్ఎస్ 7, బీజేపీ 2, కాంగ్రెస్ 2, ఇండిపెండెంట్ గా 8 గ్రామ పంచాయతీలు గెలుపోందాయి. మిరుదొడ్డి మండలంలోని 10 గ్రామపంచాయతీలుగాను, బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 1, ఇండిపెండెంట్ గా 1 ఒక్కరూ గెలుపొందారు. తోగుట మండలంలోని 17 గ్రామ పంచాయతీలు ఉండగా బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 9 మంది అభ్యర్థులు గెలుపొందారు.దౌల్తాబాద్ మండలంలోని 25 గ్రామపంచాయతీలో గాను బీఆర్ఎస్ 17,బీజేపీ 1,కాంగ్రెస్ 7 అభ్యర్థులు గెలుపొందారు.

రాయపోల్ మండలంలోని 19 గ్రామ పంచాయతీలకు గాను బీఆర్ఎస్ 8, బీజేపీ 3, కాంగ్రెస్ 8 మంది సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు దుబ్బాక కంచుకోటగా ఉండేది. ఇప్పుడేమో నాయకత్వ లోపంతో సతమతమవుతోంది. సరైన లీడర్ లేకపోవడంతోనే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఫేవలమైన రిజల్ట్ వచ్చిందని కాంగ్రెస్ క్యాడరే చర్చించుకోవడం గమనార్హం. రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకుడైన సీఎం రేవంత్ రెడ్డి ఉన్నప్పటికి నియోజక వర్గంలో సమర్థవంతమైన నాయకత్వం లేకుండా పోయింది. కనుచూపు మేరలో సరైన నాయకుడు లేక నియోజకవర్గంలో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా తయారైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ దుబ్బాక నియోజకవర్గంలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే అధికంగా సర్పంచ్ లు గెలుపొందారు.

అసలు కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద దిక్కు అంటూ లేకపోవడంతో నియోజకవర్గాల్లోని క్యాడర్‌ అయోమయంలో పడిపోయింది. కాంగ్రెస్‌ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన పేరుకు మాత్రమే పరిమితమైనట్లు పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలి జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఉనికే కనిపించడం లేదు. దీనికి తోడు కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గం ఇంచార్జీ అయిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఏనాడూ పార్టీని పట్టించుకున్న దాఖలాలు లేవని స్వయాన ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.నియోజకవర్గం వర్గాల పోరుతో పార్టీ కుదేలయిందని పార్టీ శ్రేణులు వాపోతున్నరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించలేకపోయారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీకి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫు న పోటీచేసిన సర్పంచ్ అభ్యర్థులను నియోజకవర్గం ఇంచార్జీ అయిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి పట్టించుకోలేదని లేదంటే ఆ పార్టీకి చెందిన నాయకులే ఆరోపణలు చేస్తున్నారు.

చెరుకుకు రెండుసార్లు డిపాజిట్ గల్లంతు

సోలిపోట రామలింగారెడ్డి మరణాంతరం వచ్చిన 2020 లో దుబ్బాక ఉప ఎన్నికలలో బీజేపి నుంచి మాధవనెని రఘునందన్ రావు పోటీచేయగా 63,352 ఓట్లు రాగా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తరుపున సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాతకు 62,273 రాగా, కాంగ్రెస్ పార్టీ నుంచి చేరుకు శ్రీనివాస్ రెడ్డికి వచ్చిన ఓట్లు 21,819 ఓట్లు వచ్చాయి. తదనంతరం 2023 శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన కొత్త ప్రభాకర్ రెడ్డి కి పోలయిన ఓట్లు 97,451 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి మాధవనెని రఘునందన్ రావుకు పోలయిన ఓట్లు 43,744 రాగా ఇకా కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీచేసి 24,947 ఓట్లతో ఓడిపోయి కనీసం డిపాజిట్ దక్కించుకోలేక పోయారు.

మున్సిపల్ ఎన్నికలలో

కాంగ్రెస్ జెండా ఎగిరేనా ?

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాలేకపోతుంది. ఇటీవల జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో దుబ్బాక మండలములోని 21 గ్రామా పంచాయితీలు ఉండగా బీఆర్ఎస్ పార్టీ13 పంచాయతీలను బిఆర్ఎస్ గెలుచుకోగా, బీజేపీ మూడు పంచాయతీలపై పాగా వేయగా, కాంగ్రెస్ పార్టీ కేవలం 5 గ్రామ పంచాయతీలను మాత్రమే దక్కించుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలలను బట్టి చూస్తే దుబ్బాక మున్సిపాలిటీ లో 20 వార్డులు ఉండగా కనీసం 5 వార్డులైనా గెలుస్తాయా.? వేచి లేదా చూడాలి.

Next Story