డబుల్ లైన్ కోసం భూసేకరణ పరిశీలన

by velandi.Saikiran |

ఉపయోగం లేని చోట బ్రిడ్జి నిర్మాణం అనే వార్త "దిశ" దిన పత్రికలో ప్రచురణ అయింది. దీనిపై స్పందించారు అధికారులు.

డబుల్ లైన్ కోసం భూసేకరణ పరిశీలన
X

దిశ, చిన్నశంకరంపేట: ఉపయోగం లేని చోట బ్రిడ్జి నిర్మాణం అనే వార్త "దిశ" దిన పత్రికలో మంగళవారం ప్రచురణ అయింది. ఈ వార్త స్పందించిన రైల్వే అధికారులు లైన డివిజనల్ రైల్వే ఇంజనీర్లు ధర్మరాజు, ల్యాండ్ ఆక్టివేషన్ ఆఫీసర్ రమేష్, మెదక్ ఆర్డివో రమాదేవి, మండల తాసిల్దార్ మాలతీ, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు రాజు, వినయ్,బుధవారం మండలంలోని మిర్జాపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకొని భూసేకరణకు ఉన్న అడ్డంకులు ప్రజా ప్రతినిధులును రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు అధికారులతో మాట్లాడుతూ, అణువు గాని చోట రైల్వే బ్రిడ్జి నిర్మించగా, వర్షాకాలం లో బ్రిడ్జి ముందు ఉన్న చెరువు నీళ్ళు బ్రిడ్జి కిందికి వచ్చి చేరి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారులతో మొరపెట్టుకున్నారు.

కాగా మండలంలోని మిర్జాపల్లి రైల్వే డబుల్ లైన్ కోసం భూసేకరణ భూములను మెదక్ ఆర్డిఓ రమాదేవి, రైల్వే డిఎస్ ధర్మరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా భూ సేకరణకు ఉన్న అడ్డంకులు అడిగి తెలుసుకున్నారు. రైతులు మాట్లాడుతూ, భూసేకరణకు భూములు ఇవ్వాలంటే బ్రిడ్జి వద్ద నీరు నిలవకుండా చర్యలు చేపడితే తమ భూములు ఇస్తామని రైతులు తెలిపారు. దీంతో రైల్వే డిఎస్ ఇంజనీర్ ధర్మరాజు, నీళ్లు నిలవకుండా, అండర్ డ్రైనేజీ ద్వారా చర్యలు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు. అదనపు దారి విషయం గ్రామస్తులు కూర్చుని మాట్లాడి స్థలం అప్పగిస్తే రోడ్డు నిర్మించి ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులతో పాటు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంఘని సునీత, మాజీ సర్పంచ్లు పోతరాజురమణ,జనార్ధన్,మాజీ ఉపసర్పంచ్ పోతరాజు మనోజ్ కుమార్ తో పాటు, రైతులు పాల్గొన్నారు.

Next Story