- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనంగా కుంభమేళ ప్రారంభం
by Kema Shiva Kumar |
పంచవటి క్షేత్రంలో గరుడకంగా కుంభమేళ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

X
దిశ, జహీరాబాద్:పంచవటి క్షేత్రంలో గరుడకంగా కుంభమేళ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.స్థానిక పీఠాధిపతి కాశీనాథ్ బాబా ఆధ్వర్యంలో జిల్లా పాలన అధికారులు, ప్రభుత్వ, ప్రజా ప్రతినిధులు, వేలాది మంది భక్తులు, సాధుసంతుల మధ్య ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ శరత్, ఎమ్మెల్యేలు కె.మాణిక్ రావ్, భూపాల్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, వివిధ మఠాల పీఠాధిపతుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో కుంభమేళాకు శ్రీకారం చుట్టారు. మంజీరా తీరాన భారీ ధ్వజాన్ని ప్రత్యేకంగా క్రేన్ సహాయంతో ఆవిష్కరించి అష్టదిక్పాలకులను కుంభమేళాకు ఆహ్వానించారు. ప్రారంభ సూచకంగా ఆవిష్కరించిన ధ్వజారోహణం కార్యక్రమం స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది దాదాపు 65 అడుగుల ఎత్తులో ఆవిష్కరించి ధ్వజానికి చూసేందుకు భక్తుల ఆసక్తి చూపించారు.
Next Story






