- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొమ్ము కిషన్ మరణం తీరని లోటు : దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
దిశ, తొగుట : తెలంగాణ ఉద్యమ కారులు ఘనపూర్ కు చెందిన కొమ్ము కిషన్ అకాల మరణం బాధాకరమని, వారి కుటుంబానికి అండగా ఉంటామని

దిశ, తొగుట : తెలంగాణ ఉద్యమ కారులు ఘనపూర్ కు చెందిన కొమ్ము కిషన్ అకాల మరణం బాధాకరమని, వారి కుటుంబానికి అండగా ఉంటామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఘనపూర్ ఇటీవల మరణించిన కొమ్ము కిషన్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. బీఆర్ఎస్ లో మొదటి నుంచి పని చేసిన కొమ్ము కిషన్ జైలుకు సైతం వెళ్ళాడని ఆయన గుర్తు చేశారు. ఆయన మరణం బీఆర్ఎస్ కి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే ఘణపూరులోని యాటెల్లి రాజును ఎమ్మెల్యే పరామర్శించారు. ఇటీవల రాజు తండ్రి అకాల మరణం చదవడంతో వారి కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల ప్రమాదానికి గురైన బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త మంగలి యాదగిరిని ఎమ్మెల్యే పరామర్శించారు. అలాగే రాంపూర్ లో ఇటీవల మరణించిన బీఆర్ఎస్ యువ నాయకుడు తోయేటి వెంకటేశం కుటుంబాన్ని అలాగే అప్పనపల్లి రాములు కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
హరికృష్ణ ఆరోగ్యం ఎలా ఉంది అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సొసైటీ చైర్మన్ హరికృష్ణ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సొసైటీ చైర్మన్ హరికృష్ణ రెడ్డిని గుడికందుల లో ఎమ్మెల్యే పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన ఇటీవల వివాహం చేసుకున్న కొక్కొండ నాగార్జున రెడ్డి -, అఖిల దంపతులను ఎమ్మెల్యే ఆశీర్వాదించారు. గ్రామం లో నిర్మిస్తున్న ఎస్సీ కమ్యూనిటీ హల్ నిర్మాణాన్ని పరిశీలించారు. విద్యార్థినిలు ఉన్నది లక్ష్యంతో ముందుకు సాగాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు రాంపూర్ లోని గురుకుల పాఠశాలను రాంపూర్ లోని బాలికల గురుకుల కళాశాలను ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సరైన విద్య భోజనం వసతులు అందుతున్నాయా అని ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా కళాశాలలో నెలకొన్న విద్యుత్ తాగునీటి క్రీడాస్థల సమస్యలను ప్రిన్సిపల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, నాయకులు చిలువెరి మల్లారెడ్డి, సుకూరి లింగం, బాలరాజు, బోధనం కనకయ్య, సుతారి రమేష్, కొమ్ము శరత్, కుర్మ యాదగిరి, బాలరాజు, ఎల్లం,, శ్రీనివాస్ గౌడ్, అశోక్, రాజిరెడ్డి, భైరాగౌడ్, బాల్ రెడ్డి, బైరారెడ్డి, మంగ నర్సింలు, యాదగిరి, జంగిడి బిక్షపతి,రాజశేఖర్, బండారు స్వామి గౌడ్ ఉన్నారు.






