బిల్లులు రావ‌డం లేద‌ని వంట‌గ‌దికి తాళం.. 60 మంది విద్యార్థులు పస్తులు

by Nallavelli.Anjaneyulu |

దిశ, కంగ్టి : సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని దేగుల్‌వాడి ప్రభుత్వ పాఠశాలలో శనివారం మధ్యాహ్న భోజనం వండకపోవడంతో సుమారు

బిల్లులు రావ‌డం లేద‌ని వంట‌గ‌దికి తాళం.. 60 మంది విద్యార్థులు పస్తులు
X

దిశ, కంగ్టి : సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని దేగుల్‌వాడి ప్రభుత్వ పాఠశాలలో శనివారం మధ్యాహ్న భోజనం వండకపోవడంతో సుమారు 60 మంది విద్యార్థులు పస్తులుండాల్సి వచ్చింది. భోజనం వండే నిర్వాహకులు మూడు, నాలుగు నెలలుగా బిల్లులు రాలేదని, సొంతంగా డబ్బులు పెట్టి వంట చేయడం సాధ్యం కాదని తెలిపిన తర్వాత వంటగదికి తాళం వేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థుల కోసం భోజనం సిద్ధం చేసే అవకాశం లేక ఉపాధ్యాయులు పిల్లలను ఇళ్లకు పంపించాల్సి వచ్చింది. అయితే కొందరి తల్లిదండ్రులు అప్పటికే పనులకు వెళ్లిపోవడంతో, ఆ విద్యార్థులు భోజనం చేయకుండానే తిరిగి పాఠశాలకు రావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనపై ప్రధానోపాధ్యాయురాలు వివరణ కోరగా.. "నేను ఈరోజు లీవ్‌లో ఉన్నాను. ఈ విషయానికి నాకు సంబంధం లేదు. పాఠశాలకు ఇన్‌చార్జ్‌గా మరో ఉపాధ్యాయుడికి బాధ్యతలు అప్పగించాను" అని తెలిపారు. ఈ సంఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story