ఇది సర్ నిజాయితీ అంటే..!

by Bhanu |   (  Updated:2025-12-11 06:29:28  IST  )

హుస్నాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్‌ కరుణ విధి నిర్వహణలో నిజాయితీ చాటుకున్నారు

ఇది సర్ నిజాయితీ అంటే..!
X

దిశ, హుస్నాబాద్: హుస్నాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్‌ కరుణ విధి నిర్వహణలో నిజాయితీ చాటుకున్నారు. వర్కుల్–కోహెడ రూట్‌లో హుస్నాబాద్ డిపోకు చెందిన బస్సు నెంబర్ 2426లో కోహెడ నుంచి కరీంనగర్ ప్రయాణించిన ఓ మహిళా ప్రయాణికురాలు తన పుస్తెల తాడును బస్సులోనే పోగొట్టుకుంది. ఈ విషయం తెలిసిన కండక్టర్ కరుణ, డ్రైవర్ యూసీ మౌళి బస్సులో వెతికి ఆ పుస్తెలతాడును గుర్తించారు. తరువాత దానిని డిపోకు తీసుకువచ్చి అధికారుల సమక్షంలో సంబంధిత ప్రయాణికురాలికి అప్పగించారు. విలువైన ఆభరణం దొరకడంతో ప్రయాణికురాలు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. నిజాయితీతో వ్యవహరించిన కండక్టర్ కరుణ, డ్రైవర్ మౌళిని డిపో అధికారులు అభినందించారు.

Next Story