కళింగ గుడ్ల ఫామ్ ను మూసి వేయాలి

by Ratna Kumari |

మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో దోమలు, ఈగలకు కారణమవుతున్న కళింగ లేయర్ కోళ్ల గుడ్ల ఫారం ను మూసి వేయాలని గ్రామస్తులు శనివారం ధర్నా కు దిగారు.

కళింగ గుడ్ల ఫామ్ ను మూసి వేయాలి
X

దిశ, జగదేవపూర్ : మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో దోమలు, ఈగలకు కారణమవుతున్న కళింగ లేయర్ కోళ్ల గుడ్ల ఫారం ను మూసి వేయాలని గ్రామస్తులు శనివారం ధర్నా కు దిగారు. ఈ సందర్బంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ కళింగ ఫామ్ తిమ్మాపూర్ కు కేవలం 800 మీటర్ల దూరంలో ఉండ‌టంతో ఈ ఫామ్ వదులుతున్న వ్యర్ధాల వల్ల గ్రామంలో విపరీతంగా ఈగలు, దోమలు వృద్ధి చెందుతున్నాయని వాపోయారు. కళింగ ఫామ్ యజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని చెప్పారు. గతంలో ఈగలు, దోమలు పెరిగి గ్రామంలో విష జ్వరాలు పెరిగి గ్రామ ప్రజలు హాస్పిటల్ పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో డెంగ్యూ జ్వరాలు వచ్చి ఇద్దరు యువకులు మృతి చెందారని వాపోయారు. అర్ధరాత్రి కోళ్ల ఎరువు ద్వారా వచ్చే గ్యాస్ ను గాల్లో వదలడంతో విపరీతమైన వాసనతో గాలి కలుషితమవుతుందన్నారు. కళింగ గుడ్ల ఫామ్ యజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడంలేదని, ఇండస్ట్రియల్ చట్టాలను తుంగలో తొక్కి ప్రజల ప్రాణాలకు కారణమైతున్న కలింగ గుడ్ల ఫామ్ యజమాన్యం పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గుండ్రు నర్సింహులు, పోసాన్పల్లి స్వామి, కొంతం లక్ష్మయ్య , బుచ్చోళ్ళ కనకయ్య, బోన్ల కనకయ్య , పోసానిపల్లి కనకయ్య, పోసానిపల్లి రమేష్, దండు సత్యనారాయణ, తలకొక్కుల సత్యనారాయణ, గుండ్రు ఉప్పలయ్య, రసమల్ల శ్రీకాంత్, గుండ్రు స్వామి పాల్గొన్నారు.

Next Story