ముంపు గ్రామాలకు కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం

by Ratna Kumari |

మల్లన్నసాగర్ ముంపు గ్రామాలకు కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి స్పష్టం చేశారు.

ముంపు గ్రామాలకు కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం
X

దిశ, గజ్వేల్ రూరల్ : మల్లన్నసాగర్ ముంపు గ్రామాలకు కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం గజ్వేల్ - ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సింగారం, ఎర్రవల్లి, పల్లెపహాడ్, వేములఘాట్, ఏటిగడ్డకిష్టాపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, సంగాపూర్, లక్ష్మాపూర్, క్యాసారం, 20వ వార్డు, 1వ వార్డులాల్లో నిర్వహించిన కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్ష రెడ్డితో కలిసి నర్సారెడ్డి పాల్గొని మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచి గత రెండు సంవత్సరాల నుంచి గజ్వేల్ నియోజకవర్గ ప్రజల సమస్యలతో పాటు ముంపు గ్రామాల భూ నిర్వాసితుల సమస్యలను పట్టించుకోకుండా లక్షల జీతాలు తీసుకుంటూ ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నాడని విమర్శించారు. గతంలో దుబ్బాక ఎమ్మెల్యేగా, ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్న రఘునందన్ రావు మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తానని, ఎక్కువ పరిహారం ఇప్పిస్తానని మాట ఇచ్చి మాట తప్పాడని అన్నారు. ఓట్ల కోసం వచ్చే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులను సమస్యల పట్ల ప్రశ్నించాలని నిలదీయాలని కోరారు. ముంపు గ్రామాల నుంచి 6 వార్డులలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే సీఎం రేవంత్ రెడ్డిని ముంపు గ్రామాలకు పిలిపించి సమస్యలు పరిష్కరించే విధంగా నేను బాధ్యత తీసుకుంటానని ముంపు బాధితులకు నర్సారెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మొనగారి రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖాదర్ పాషా, తీగుళ్ల ప్రభాకర్, కర్ణాకర్, సుధాకర్, శ్రావణ్ కుమార్, సత్తయ్య, పిట్ల శ్రీనువాస్, ధర్మారెడ్డి, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story