- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మార్వోపై జేసీ ఆగ్రహం...!
నిమ్జ్ ప్రాజెక్టు కోసం ఝరాసంగం మండలం ఎల్గోయి గ్రామంలో రెండో విడతగా 195 ఎకరాల భూమి సేకరణకు గత ఏడాది జూలై 18న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

దిశ, ఝరాసంగం : నిమ్జ్ ప్రాజెక్టు కోసం ఝరాసంగం మండలం ఎల్గోయి గ్రామంలో రెండో విడతగా 195 ఎకరాల భూమి సేకరణకు గత ఏడాది జూలై 18న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 23న నిర్వహించిన గ్రామసభలో ఇప్పటికే మొదటి విడతలో 1,800 ఎకరాల భూమిని ఇచ్చామని, మిగిలినది సారవంతమైన మూడు పంటల భూమి కావడంతో ఇవ్వబోమని రైతులు స్పష్టంగా తెలిపారు. రెండో విడత భూసేకరణపై సమీక్షించేందుకు శనివారం సంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ మాధురి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. రైతులు పెద్ద సంఖ్యలో నిరసన చేపట్టడంతో, జేసీ తహసిల్దార్ తిరుమలరావు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులతో మాట్లాడకుండానే వెనుదిరిగారు. భూసమస్యలు, అక్రమ ఎర్రమట్టి తరలింపు, రిజిస్ట్రేషన్లలో అవకతవకలపై రైతులు ఫిర్యాదు చేస్తూ తహసీల్దార్‌ను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసి, 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించి రైతులు, రైతు కూలీలకు పునరావాసం కల్పించాలని జహీరాబాద్ ఆర్డీఓ దేవుజా, నిమ్జ్ స్పెషల్ డిప్యూటి కలెక్టర్ విశాలాక్షిలకి రైతులు వినతిపత్రం అందజేశారు.






