ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డ్డ జ‌గ్గారెడ్డి

by Ratna Kumari |

ఇచ్చిన మాట ప్రకారం.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కట్టుబడి తన మాటను నెరవేర్చుకున్నారు.

ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డ్డ జ‌గ్గారెడ్డి
X

దిశ, సంగారెడ్డి : ఇచ్చిన మాట ప్రకారం.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కట్టుబడి తన మాటను నెరవేర్చుకున్నారు. రెండు రోజుల క్రితం నియోజకవర్గ పరిధిలో నివసిస్తున్న పేపర్ బాయ్స్ కి సైకిళ్లను పంపిణీ చేసిన ఆయన తాజాగా తన వద్ద గతంలో పేర్లు నమోదు చేసుకున్న మరో 62 మంది చిన్నారులకు సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటివరకు తమ కార్యాలయంలో పేర్లను నమోదు చేయించుకున్న విద్యార్థులకు విడతల వారీగా సైకిళ్లు అందిస్తున్నామని వివరించారు. సైకిళ్ళ పంపిణీ సందర్భంగా చిన్నారులతో జగ్గారెడ్డి ముచ్చటించారు. తాము ఇంటి నుంచి పాఠశాలకు పోయి వచ్చేందుకు ఈ సైకిళ్ళు కావాలని అడిగినట్లు విద్యార్థులు జగ్గారెడ్డికి వివరించారు. 25మంది బాలికలు, 37 మంది బాలురకు సైకిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చేర్యాల ఆంజనేయులు, జార్జ్ మాథ్యూస్, కూన సంతోష్, కిరణ్ గౌడ్, శ్రీకాంత్, మహేష్ ముదిరాజ్, రాజు, సుదీప్ తదితరులు పాల్గొన్నారు.

Next Story