సంగారెడ్డి ప్రజలకు స్వచ్ఛమైన మంజీరా నీళ్లు అందాలి

by velandi.Saikiran |

సంగారెడ్డి ప్రజలకు స్వచ్ఛమైన మంజీరా నీళ్లు అందించాలని, టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు

సంగారెడ్డి ప్రజలకు స్వచ్ఛమైన మంజీరా నీళ్లు అందాలి
X

దిశ, సంగారెడ్డి బ్యూరో : సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు స్వచ్ఛమైన మంజీరా నీళ్లు అందించాలని, ఫిల్టర్ బెడ్ నిర్వహణ ప్రైవేట్ అప్పగించాలని ఈ విషయంలో కలెక్టర్ తో చర్చిస్తామని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారులతో కలిసి రాజంపేట ఫిల్టర్ బెడ్ ను జగ్గారెడ్డి పరిశీలించారు. 2010లో మంజీరా వాటర్ స్కీమ్ ప్రారంభించినప్పుడు ఒకేసారి పది ట్యాంక్ లు నిండేవని, గంటన్నర నీటి సరఫరా జరిగేదని ఇప్పుడు ఎందుకు అలా జరగడం లేదని జగ్గారెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాత విధంగానే తిరిగి మున్సిపాలిటీలో నీటి సరఫరా జరగాలని, అందుకు ఏం చేయాలో ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.

రాష్ట్ర విభజన తర్వాత, కేసీఆర్ సీఎం హయంలో మిషన్ భగీరథ కోసం సింగూర్ ప్రాజెక్ట్ వద్ద వంద కోట్లతో ఫిల్టర్ బెడ్ నిర్మించారని, పదేళ్ల పాటు ఒక కాంట్రాక్టర్ కు మెయింటేనెన్స్ కు ఇచ్చారని, ఆ కాంట్రాక్టర్ సరిగా పట్టించుకోకపోవడంతో డిస్ట్రిబ్యూషన్ లైన్స్ పాడై సరఫరాకు ఇబ్బంది అవుతుందని అధికారులు జగ్గారెడ్డికి పరిస్థితిని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న లైన్ల స్థానంలో మిషన్ భగీరథ లైన్ లు ఏర్పాటు చేశారని, అవి నాణ్యత లేకపోవడంతో ఇబ్బందులు అవుతున్నాయని వివరించారు. మిషన్ భగీరథ ద్వారా కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో మాదిరి 10 ట్యాంక్ ల ద్వారా మంజీరా నీటి సరఫరా జరగాలని, అందుకు తగ్గ ప్రణాళికలు, అవసరమైన నిధులేంతో నివేదికలు రూపొందించాలని జగ్గారెడి అధికారులకు సూచించారు.

ఫిల్టర్ బెడ్ విస్తరణకు మూడు ఎకరాల ప్రైవేట్ లాండ్ కొనుగోలు చేసేందుకు కూడా ప్రతిపాదనలు సిద్దం చేయాలని, గతంలో మాదిరిగా ఫిల్టర్ కావడం లేదని, పాత పద్దతుల్లో ఫిల్టర్ చేస్తున్నారని, ఫిల్టర్ బెడ్ లో అపరిశుభ్ర వాతావరణం ఉంటుందని స్థానికులు జగ్గారెడ్డికి తెలిపారు. ఫిల్టర్ బెడ్ నిర్వహణ మున్సిపల్ అధికారులు నిర్వహిస్తారా..? లేదా ప్రైవేట్ ఏజెన్సికి అప్పగించాలా అని అధికారులను అడిగారు. గతం లో ఫిల్టర్ బెడ్ కు కరెంట్ సరఫరా లేకపోతే ప్రజల కోసం ఏడాది పాటు నెలకు రూ. 6.5 లక్షల చొప్పున ఏడాది పాటు రూ. 75 లక్షలు జగ్గారెడ్డి తన సొంత నిధుల ఖర్చతో జెనరేటర్ ద్వారా పవర్ సప్లయ్ చేసిన విషయాన్ని స్థానికులు గుర్తు చేశారు.

ఫిల్టర్ బెడ్ కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వకపోతే సబ్ కాంట్రాక్టర్ కు జగ్గారెడ్డి రూ. 20 లక్షలు తన స్వంత నిధులను ఇచ్చిన విషయం కూడా గుర్తు చేశారు. ప్రైవేట్ ఏజెన్సిలకు ఫిల్టర్ బెడ్ నిర్వహణ అప్పగించేలా అనుమతి ఇవ్వాలని కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లకు లెటర్ ద్వారా విన్నవించాలని జాగ్రీది నిర్ణయించారు.

Next Story