అధిష్టానం స్పందిస్తే బాగుండేది

by Nallavelli.Anjaneyulu |

జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు.

అధిష్టానం స్పందిస్తే బాగుండేది
X

దిశ, సంగారెడ్డి బ్యూరో : జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు పార్టీని వీడటం బాధకరమన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా ఉన్న ఆయన పార్టీని వీడటం బాధగా ఉందని జగ్గారెడ్డి అవేదన వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి విషయంలో అంతర్గతంగా చర్చించుకోవాల్సి ఉండాల్సింది అని అభిప్రాయపడ్డారు. ఏఐసీసీ స్థాయిలో మరోసారి చెక్ చేసుకుని, డైరెక్ట్ గా డిల్లీ నాయకత్వమే రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించి ఉంటే బాగుండేదని..ఇది తన వ్యక్తి అభిప్రాయం అన్నారు. ఎమ్మెల్యే లు, నాయకులు పార్టీలు మారడం ప్రస్తుత రాజకీయాల్లో సహజంగా జరుగుతుందని, జీవన్ రెడ్డి పార్టీ మారడానికి గల కారణాలను బహిరంగంగా మీడియాతో మాట్లాడాలేమని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ విషయమై పార్టీలో అంతర్గతంగా పార్టీలో చర్చిస్తామన్నారు.

Next Story