- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే విజ్ఞప్తికి స్పందించిన మంత్రి ఉత్తమ్
కూడవెల్లి వాగులోకి నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేసిన విజ్ఞప్తికి మంత్రి తక్షణమే స్పందించారు.

దిశ,దుబ్బాక : కూడవెల్లి వాగులోకి నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేసిన విజ్ఞప్తికి మంత్రి తక్షణమే స్పందించారు. సోమవారం అసెంబ్లీలో మంత్రిని కలిసిన కొత్త ప్రభాకర్ రెడ్డి పంట పొలాలు ఎండిపోతున్నాయని,కూడవెల్లి వాగు నీళ్లు లేక వట్టి పోయిందని, కూడవెల్లి వాగు లోకి మల్లన్న సాగర్ జలాలు విడిచి దుబ్బాక నియోజకవర్గంలోని రైతుల పంట పొలాలు కాపాడాలని కోరారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి స్పందించిన మంత్రి వెంటనే నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. మల్లన్న సాగర్ నుండి కూడవెల్లి వాగులోకి 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని ఎమ్మెల్యే తెలిపారు. వాగు ప్రవహిస్తున్నందున వాగు పరివాహక రైతులంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. తాను చేసిన విజ్ఞప్తికి స్పందించి నీటి విడుదల చేసిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే చిన్న శంకరంపేట, రామాయంపేట కాలువలకు నీటి సరఫరా పెంచాలని మంత్రి అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
Read More..






