- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైకోర్టు ఆదేశాలతో కాలువ జాయింట్ సర్వే కోసం తనిఖీ..
హైకోర్టు ఆదేశాల మేరకు చెరువు కట్ట కాలువను రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల జాయింట్ సర్వే కోసం మంగళవారం మనోహరాబాద్ నుంచి రామాయిపల్లీ వరకు స్థానిక ఎస్సై సందీప్ రెడ్డి, పోలీస్ బలగాల మధ్య తనిఖీ చేసినట్లు మెదక్ జిల్లా ఇరిగేషన్ ఎస్ ఇ యేసయ్య, డీఈ శ్రీకాంత్, మనోహరాబాద్ ఏఈ అనురాధలు తెలిపారు.

X
దిశ, మనోహరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు చెరువు కట్ట కాలువను రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల జాయింట్ సర్వే కోసం మంగళవారం మనోహరాబాద్ నుంచి రామాయిపల్లీ వరకు స్థానిక ఎస్సై సందీప్ రెడ్డి, పోలీస్ బలగాల మధ్య తనిఖీ చేసినట్లు మెదక్ జిల్లా ఇరిగేషన్ ఎస్ ఇ యేసయ్య, డీఈ శ్రీకాంత్, మనోహరాబాద్ ఏఈ అనురాధలు తెలిపారు. మండల కేంద్రమైన మనోహరాబాద్ ఎల్లమ్మ చెరువు నుంచి మండలంలోని రామాయపల్లి పెద్ద చెరువు వరకు అలుగు నీరు పారడానికి కట్టు కాల్వను గతంలో సర్వే చేశామన్నారు.
దీంతో స్థానిక రైతులు హైకోర్టును ఆశ్రయించగా వాదనలు విని నక్ష పరంగా ఉన్న కాలువను సర్వే చేసి కాలువను ఏర్పాటు చేయాలని ఇచ్చిన కోర్టు ఆదేశాల మేరకు, స్థానిక నాయకులు పొట్టోళ్ల వెంకటేష్ గౌడ్, బిక్షపతి ముదిరాజ్, రైతుల సమక్షంలో తనిఖీలు చేశామని వారు తెలిపారు.
Next Story






