15 వరకు సీటీ పోలీస్ యాక్ట్ అమలు

by Kema Shiva Kumar |   (  Updated:2023-06-07 14:39:30  IST  )

పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 15 వరకు సీటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు.

15 వరకు సీటీ పోలీస్ యాక్ట్ అమలు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 15 వరకు సీటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలన్నారు. బంద్ ల పేరిట వివిధ కారణాలు చూపుతూ.. బలవంతంగా సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణ నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. దీనికి తోడు కమిషనరేట్ పరిధిలో డీజే సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు ఈనెల 15 వరకు అమలులో ఉంటాయన్నారు. నిబంధనలు ఉల్లంఘించి డీజే వినియోగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పైన పేర్కొన్న నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ శ్వేత హెచ్చరించారు.

Next Story