- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండాపూర్ భూములపై ‘దిశ’ వరస కథనాలతో అక్రమ రిజిస్ట్రేషన్లు నిలిపివేత
కొండాపూర్ లోని సర్కారు భూమిని అధికారులతో కలిసి ఖద్దర్ పెద్దలు పట్టా భూమిగా మార్చేసిన కుట్ర ఆగిపోయింది. కోట్లాది విలువైన భూమిని పట్టగా మార్చి న్యాయపరంగా చిక్కులు రాకుండా చకా చకా రిజిస్ట్రేషన్ చేశారు.

దిశ, మెదక్ ప్రతినిధి: కొండాపూర్ లోని సర్కారు భూమిని అధికారులతో కలిసి ఖద్దర్ పెద్దలు పట్టా భూమిగా మార్చేసిన కుట్ర ఆగిపోయింది. కోట్లాది విలువైన భూమిని పట్టగా మార్చి న్యాయపరంగా చిక్కులు రాకుండా చకా చకా రిజిస్ట్రేషన్ చేశారు. ఏళ్లుగా రికార్డుల్లో ఖరీజ్ ఖాతా గా ఉన్న 144 సర్వే నెంబర్‌లోని 11 ఎకరాల భూమి పట్టాగా రికార్డుల్లో మార్చేయడం పై స్థానికుల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. ప్రభుత్వ భూమి బడా నేతలు కాజేస్తున్న వైనంపై దిశ పత్రిక కథనాలు ప్రచురించింది. వరస కథనాలతో స్పందించిన అధికారులు కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపారు. అది ప్రభుత్వ భూమిగా నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఖరీజ్ ఖాతాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేయవద్దని రెవెన్యూ శాఖ ఆదేశించింది. దీంతో కొండాపూర్ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా చేస్తున్న పోరాటం ఫలించినట్లు సంతోషం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కొండాపూర్‌లో 144 సర్వే నంబర్ లో 11.37 ఎకరాల భూమి ఉంది.
ఈ భూమి గతంలో నరేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి పేరిట ఉండేది. కానీ వాళ్ళు స్థానికంగా ఉండకపోవడంతో అప్పట్లో భూమి పన్ను చెల్లించలేదు. దీంతో సదరు భూమిని ఖరీష్ ఖాతాలో చేర్చారు. 144 లో ఉన్న భూమి ఖరీజ్ ఖాతాలో ఉన్నందున అది ప్రభుత్వ భూమిగా 2012 లో ఉమ్మడి జిల్లా ల్యాండ్స్ సర్వే ఏ డీ నిర్ధారించారు. ప్రభుత్వ భూమి కావడంతో ఆ భూమిలో ప్రభుత్వం క్రీడా ప్రాంగణం, అంగాన్ వాడి స్కూల్, బస్టాప్, వాటర్ ట్యాంకర్ నిర్మాణం జరిపారు. కొండాపూర్ లో విలువైన ప్రభుత్వ భూమి ఉన్నట్టుగా గుర్తించిన అప్పటి ప్రభుత్వ పెద్దలు కొందరు అధికారులలో కుమ్మక్కై ఖరీజ్ ఖాతా భూమిని పట్టా భూమిగా మార్చేసి ఏకంగా పట్టాలు చేసి విక్రయాలు కూడా సాగించారు. వేరు వేరు రిజిస్ట్రేషన్ లు చేసి చట్ట పరంగా ఇబ్బందులు కలగకుండా పథకం రూపొందించి కోట విలువైన భూమిని కాజేసి కుట్రను దిశ పత్రిక లో వచ్చిన కథనాలు భగ్నం చేశాయి. పత్రికలో వచ్చిన కథనాలతో గ్రామస్తులు రోడ్డు పైకి వచ్చి ఆందోళనలు సైతం చేసి భూములను కాపాడేందుకు పోరాటం చేశారు.
ఎట్టకేలకు.. కుట్రదారులు చెక్..!
కొండాపూర్ లో ప్రభుత్వ భూమి.. పట్టా భూమి గా మారిన కుట్ర పై దిశ పత్రికలో కొండాపూర్‌లో పట్టా భూమిగా ప్రభుత్వ భూమి, ఖద్దర్ పెద్దల హస్తం, కొండాపూర్ భూముల పై చర్యలేవి..!, పట్టు బిగిస్తున్న కొండాపూర్‌తో పాటు పలు వరస కథనాలు ప్రచురించింది. దిశలో వచ్చిన కథనాలు చేసిన జిల్లా యంత్రాంగం ఆర్డీవో తో పాటు నలుగురు తహశీల్దార్లతో కలిసి కమిటీ ఏర్పాటు చేశారు. రెవెన్యూ రికార్డులను పూర్తిగా పరిశీలించిన అధికారులు జిల్లా కలెక్టర్ కు నివేదిక అందజేశారు. 2012 లో అప్పటి ఏడీ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అది ప్రభుత్వం భూమిగా నిర్ధారణ చేసిన అధికారులు కొంత కాలంగా గోప్యంగా ఉంచారు. తీరా సీసీఎల్ నుంచి వచ్చిన ఉత్తర్వులతో ఇక పై 144 సర్వే నెంబర్‌లో ఉన్న భూములను రిజిస్టర్ చేయవద్దని ఆదేశించారు.
అలుపెరగని పోరాటం..
కొండాపూర్ లో కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కళ్లెదుటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్న తీరు పై ఆగ్రహించిన గ్రామస్తులు పోరాటం తీవ్రతరం చేశారు.దిశ పత్రికలో వచ్చిన కథనాలతో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ, కోదండ రెడ్డి తో జిల్లా కలెక్టర్ కు అనేక మార్లు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమి పట్టగా మార్చి ఖద్దర్ నేతలు కాజేసేందుకు చేసిన కుట్రను ఆపేందుకు అలుపెరగని పోరాటం చేశారు. రెండేళ్ల పాటు చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. గ్రామస్తులు కోరినట్టు 144 లో ఉన్న 11 ఎకరాలు ప్రభుత్వ భూమిగా మారడం పై కొండాపూర్ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దిశ పత్రిక కు కృతజ్ఞతలు తెలిపారు.






