ఎమ్మెల్యే తీరు మార‌కుంటే గ్రామాల్లో తిర‌గ‌నివ్వం : బ్లాక్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు శ్రీకాంత్ రెడ్డి

by Ratna Kumari |

పటాన్ చెరు ఎమ్మెల్యే తీరు మారకుంటే గ్రామాల్లో తిరగనీయమని జిన్నారం మండల కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే తీరు మార‌కుంటే గ్రామాల్లో తిర‌గ‌నివ్వం :  బ్లాక్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు శ్రీకాంత్ రెడ్డి
X

దిశ, జిన్నారం : పటాన్ చెరు ఎమ్మెల్యే తీరు మారకుంటే గ్రామాల్లో తిరగనీయమని జిన్నారం మండల కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిన్నారం మున్సిపల్ కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో మీడియా స‌మావేశాన్ని నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని నల్తూర్ గ్రామంలో ఏర్పాటు కానున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను వేరే ప్రాంతానికి తరలించేందుకు ఎమ్మెల్యే కుట్రలు చేస్తున్నారని మండల కాంగ్రెస్ నాయకులు ఆగ్రహించారు. మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ.. జిన్నారం మండలం నల్తూరు గ్రామంలో సర్వేనెంబర్ 159 లోని 25 ఎకరాలలో ఏర్పాటుకు సిద్ధం చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలును మార్చాలని, ఈ ప్రాంతంపై సవితి ప్రేమ చూపిస్తున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన ప్రవర్తన మార్చుకొవాలని అన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే జిన్నారంకు ఇప్పటివరకు చేసిన అన్యాయం చాలదన్నట్టుగా 200 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ స్కూలును వేరే ప్రాంతానికి తరలించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

తీరు మారకుంటే మండల పరిధిలోనీ గ్రామాలలో తిరగనీయమని హెచ్చరించారు.స్థానిక నాయకులు కూడా కొంతమంది ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతున్నారని వారు కూడా మండల ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్డే కృష్ణ మాట్లాడుతూ ఎవరెన్ని కుట్రలు చేసినా యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ జిన్నారం మండలం నల్తూర్ గ్రామంలో ఏర్పాటు చేయడం తధ్యమని, స్థానిక నాయకులతో కలిసి జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామిలను కలిసి కచ్చితంగా నల్తూరు గ్రామంలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు చేస్తామని ఆయన అన్నారు. ఇకనైనా స్థానిక శాసనసభ్యులు పద్ధతి మార్చుకొని జిన్నారం మున్సిపాలిటీ పై సవితి ప్రేమను మాని అభివృద్ధికి సహకరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story