రైతులకు ఇబ్బంది కలిగిస్తే ఉపేక్షించేది లేదు...

by Taduka Kalyani |

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు వస్తున్న రైతులకు ఇబ్బంది కలిగిస్తే ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.

రైతులకు ఇబ్బంది కలిగిస్తే ఉపేక్షించేది లేదు...
X

దిశ, అక్బర్ పేట భూంపల్లి : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు వస్తున్న రైతులకు ఇబ్బంది కలిగిస్తే ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. గురువారం అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని రామేశ్వరంపల్లి, అందే, వీరారెడ్డిపల్లి, జంగపల్లి, కాజీపూర్, అక్బర్ పేట గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్ పర్సన్ బొమ్మర సంయుక్త శ్రీధర్, ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ... ధాన్యంలో తేమశాతం మించకుండా ఎండబెట్టాలని, మట్టితో లేకుండా విక్రయించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, ఏఈఓ లు, ఏఎంసీ డైరెక్టర్లు, సభ్యులు, మాజీ ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story