- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భోజనం ఏలా ఉందమ్మా.. మెనూ ప్రకారం ఇస్తున్నారా..? : కేజీబీవీ విద్యార్ధినులను ఆరా తీసిన:Minister Harish Rao
భోజనం ఏలా ఉందమ్మా.. మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా..? అంటూ రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కేజీబీవీ విద్యార్థినులను ఆప్యాయంగా పలకరించారు.

దిశ, సిద్దిపేట ప్రతినిధి : భోజనం ఏలా ఉందమ్మా.. మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా..? అంటూ రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కేజీబీవీ విద్యార్థినులను ఆప్యాయంగా పలకరించారు. సిద్ధిపేట అర్బన్ మండలం ఎల్లుపల్లి-మిట్టపల్లి కేజీబీవీ అప్ గ్రేడ్ జూనియర్ కళాశాలలో రూ.2.30 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేజీబీవీ విద్యార్థినీలతో ముచ్చటించారు. భోజనం ఎలా అందిస్తున్నారని మంత్రి ఆరా తీయగా ఉదయం అల్ఫాహారం, మధ్యాహ్నం గుడ్డుతో కూడిన భోజనం, సాయంత్రం నాణ్యమైన భోజనం అందిస్తున్నారని తెలిపారు.
అదేవిధంగా ఆదివారం చికెన్‌తో కూడిన భోజనం వడ్డిస్తున్నారని విద్యార్థినులు బదులిచ్చారు. కేజీబీవీ ఇంటర్మీడియట్ విద్యార్థినులు ల్యాబ్ సౌకర్యం కల్పించాలని మంత్రి హరీష్ రావును కోరగా వెంటనే మంజూరు చేయిస్తానని హామీ నిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్పొరేట్ స్థాయి విద్య, వసతులతో జిల్లాలోని 22 కేజీబీవీల్లో 17 కేజీబీవీలలో నో అడ్మిషన్స్ బోర్డు పెట్టినట్లు, ఇప్పుడు అడ్మిషన్లు దొరకని పరిస్థితికి జిల్లాలోని కేజీబీవీలు చేరడం అభినందనీయమన్నారు. పేదింటి బాలికలకు ఉన్నత విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.






