- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతర్జాతీయ సాహిత్య పోటీల్లో కొండపాక విద్యార్థుల ఘనత
దిశ, కొండపాక : కెనడా నుంచి వెలువడే 'గడుగ్గాయి' బాలల మాసపత్రిక అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన కథలు, కవితల పోటీల్లో కొండపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.

X
దిశ, కొండపాక : కెనడా నుంచి వెలువడే 'గడుగ్గాయి' బాలల మాసపత్రిక అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన కథలు, కవితల పోటీల్లో కొండపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. పదో తరగతి విద్యార్థి ఏ. రిశ్విక్ రాసిన కథకు అంతర్జాతీయ స్థాయిలో తృతీయ బహుమతి (రూ. 500 నగదు) లభించింది. వీరితో పాటు ఎం. కౌశిక్, ఎల్. గౌతమి, జి. హర్షవర్ధన్, రిత్విక్ తేజ, డి. వరుణ్ తేజ్, పి. సన్విలా శ్రీ, జి. ధనుష్, పి. చరణ్ తమ రచనలకు ప్రోత్సాహక బహుమతులు అందుకున్నారు. విద్యార్థులను తీర్చిదిద్దిన తెలుగు ఉపాధ్యాయురాలు జి. సత్యలక్ష్మిని, విజేతలను ప్రధానోపాధ్యాయులు బి. విఠల్ నాయక్, గ్రామ సర్పంచ్ నవీన శ్రీనివాస్ ఉపాధ్యాయ బృందం అభినందించారు. గ్రామీణ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణమని వారు కొనియాడారు.
Next Story






