నిరంతర శ్రామికుడు హరీష్ రావు : టీ.ఎస్.హెచ్.డీ.సీ చైర్మన్ చింతా ప్రభాకర్

by Disha Web Desk 1 |
నిరంతర శ్రామికుడు హరీష్ రావు : టీ.ఎస్.హెచ్.డీ.సీ చైర్మన్ చింతా ప్రభాకర్
X

దిశ, సంగారెడ్డి : నిరంతర శ్రామికుడు, ప్రజా సేవకుడు మంత్రి హరీష్ రావు అని తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు. శనివారం రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు చింత ప్రభాకర్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని చింత ప్రభాకర్ క్యాంపు కార్యాలయ ఆవరణంలో మంత్రి హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా , నియోజకవర్గం తరుపున మంత్రి హరీష్ రావుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి మంత్రి హరీష్ రావు సేవలు అవసరమని, జనం మెచ్చిన నాయకుడు పేదల గుండెచప్పుడు మంత్రి హరీష్ రావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్ విజయేందర్ రెడ్డి, ప్రభుగౌడ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed