అట్టహాసంగా మంత్రి హరీష్ జన్మదిన వేడుకలు

by Disha Web Desk 1 |
అట్టహాసంగా మంత్రి హరీష్ జన్మదిన వేడుకలు
X

దిశ, సిద్దిపేట అర్బన్ : తెలంగాణ రాష్ట్ర అర్థిక, వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు సిద్దిపేట అర్బన్ మండలంలో అంబరానంటాయి. ఆయా గ్రామాల సర్పంచ్ ల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున కేక్ కట్ లు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. తమ అభిమాన నాయకుడు మంత్రి హరీష్ రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గ్రామంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యువకులు గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటిన కౌన్సిలర్ వినోద్ గౌడ్..

మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా 5వ వార్డ్ కౌన్సిలర్ అన్నగోని వినోద్ గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేరుగు రాజనర్సుతో కలిసి మొక్కలు నాటారు. మంత్రి హరీష్ రావు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మరింత సిద్దిపేటను అభివృద్ధి పరచాలని కోరుకుంటూ వార్డులోని పలు దేవాలయాల్లో చర్చిలో మసీదులో ప్రత్యేక పూజలు ప్రార్థనలు నిర్వహించారు. రాబోయే రోజుల్లో మరోసారి ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టుతారని ధీమా వ్యక్తం చేశారు. హరితహరం ఇన్ చార్జి ఐలయ్య , పలువురు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story