ఘనంగా మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు

by Disha Web Desk 1 |
ఘనంగా మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు
X

దిశ, కొండపాక: ఉమ్మడి కొండపాక మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. దుద్దెడలోని స్వయంభు శంభు దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపి అనంతరం కేక్ కట్ చేశారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నూనె కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆరెపల్లి మహాదేవ్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు అనంతుల నరేందర్, ఎల్లం, మంచాల చిన్న శ్రీనివాస్, పెద్దంకుల శ్రీనివాస్, దమ్మకపల్లి సర్పంచ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. కుకునూరుపల్లి రైతు వేదిక వద్ద కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు చేశారు. అలాగే మెదినిపూర్, తిప్పారం తదితర గ్రామంలో మంత్రి హరీష్ రావు పుట్టినరోజు జరుపుకున్నారు.

Next Story

Most Viewed