గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

by Taduka Kalyani |

గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు.

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
X

దిశ, నారాయణఖేడ్: గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం నిజాంపేట మండలం ఖానాపూర్- (బి) గ్రామంలో రూ. 20 లక్షలతో ఎస్ డీఎఫ్ నిధులతో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పల్లెల్లో ప్రగతి కనువిందు చేస్తోందని, అభివృద్ధి ఫలాలు పేదలకు అందుతున్నాయని చెప్పారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలువాలని కోరారు. వారితో పాటుగా నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ రాంసింగ్, మండల జడ్పీటీసీ నర్సింహా రెడ్డి, ఎంపీపీ తనయులు జలెందర్, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణ గౌడ్, కృష్ణ రెడ్డి, భూపాల్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story