- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుప్రీంకోర్టు తీర్పుతో ఉపాధ్యాయుల్లో కలవరం
ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాస్ కావాలనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉపాధ్యాయులను కలవరపెడుతోంది.

దిశ, పాపన్నపేట: ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాస్ కావాలనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉపాధ్యాయులను కలవరపెడుతోంది. ఐదేళ్ల సర్వీస్ కు పూర్తి చేసుకున్న ప్రతి ఉపాధ్యాయుడు రానున్న రెండేళ్లలో ఉపాధ్యాయ అర్హత పరీక్షను తప్పనిసరిగా పాస్ కావాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం పట్ల ఉపాధ్యాయుల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉపాధ్యా య సంఘాల ఆధ్వర్యంలో సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కోరిన విజ్ఞప్తిని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సీటీఈ తోసిపుచ్చింది. దీంతో సుప్రీం కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రివ్యూ పిటిషన్ వేయించి మినహాయింపు పొందేందుకు వారు ప్రయత్నం చేస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ నియామకాలకు ఉపాధ్యాయ అర్హత పరీక్షను తప్పనిసరి చేస్తూ 2017ఆగస్టు 23న పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. అప్పటి ప్రభుత్వం అప్పటికే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ఈ పరీక్ష నుంచి మినహాయింపు ఇచ్చింది. కాగా తాజాగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో ఇప్పటికీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణత కాని ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది.
సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం లోని టెట్ పరీక్ష ఉత్తీర్ణత కాకుండా ఉన్నటువంటి ఉపాధ్యాయుల వివరాలను సుప్రీంకోర్టుకు అందజేసింది దీంతో ఉపాధ్యాయులు సర్వీసులో ఉన్నటువంటి వారికి ఉపాధ్యా య అర్హత పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం ఈ దిశగా కసరత్తు చేసి రివ్యూ పిటిషన్ వేయాల ని ఉపాధ్యాయ సంఘాల నుంచి డిమాండ్ వ్యక్తం అవుతోం ది. జిల్లాలో మొత్తం 3,522 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందు లో 1,177మంది ఉపాధ్యాయులు ఇప్పటికే ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఇంకా 2,345 మంది టెట్ ఉత్తీర్ణత సాధించని వారు ఉన్నట్లు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో టెస్టులు తప్పనిసరి చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో 2011లో టెట్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు తెచ్చారు. అప్పటినుంచి 2012లో ఒకసారి, రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2017, 2024 లో నియమించినటువంటి ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ అర్హత సాధించిన వారికి మాత్రమే అవకాశం ఇచ్చారు. అప్పుడు నిర్వహించిన పరీక్షల్లో కొంతమంది ఉపాధ్యాయుల సైతం పాల్గొని ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సాధించని ఉపాధ్యాయులు చాలామంది ఉండడంతో మెజారిటీ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై మినహాయింపు కోసం ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలని ఎన్సీటీఈకి ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. కానీ, ఈ విజ్ఞప్తిని ఎన్సీటీ యూ తిరస్కరించింది. దీంతో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రానున్న రెండు సంవత్సరాలలో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తప్పనిసరిగా టెట్ పాస్ కావడం అనివార్యమైంది. ఈవిషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పును పునః సమీక్షించేలా రివ్యూ పిటిషన్ వేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశం మీద ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందోనని అంశం ఆసక్తి రేపుతోంది.






