మహిళల అభ్యున్నతే ప్రభుత్వ ద్వేయం : మంత్రి వివేక్ వెంకటస్వామి

by Nallavelli.Anjaneyulu |

దిశ, నర్సాపూర్ : రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికంగా ఎదిగేందుకు, సామాజిక శ్రేయస్సు కోసం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, మహిళా సంఘాల సభ్యులకు అందజేస్తున్న వడ్డీ లేని రుణాలను

మహిళల అభ్యున్నతే ప్రభుత్వ ద్వేయం :  మంత్రి వివేక్ వెంకటస్వామి
X

దిశ, నర్సాపూర్ : రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికంగా ఎదిగేందుకు, సామాజిక శ్రేయస్సు కోసం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, మహిళా సంఘాల సభ్యులకు అందజేస్తున్న వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో శనివారం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో కార్మిక గనుల శాఖ, జిల్లా ఇన్ చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, కలెక్టర్ రాహుల్ రాజ్ హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 21 వేల కోట్లతో మహిళలకు వడ్డీ లేని రుణాలను అందించినట్లు తెలిపారు. అలాగే 8000 కోట్లతో ఉచిత బస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. జిల్లాలో 1,27,000 కుటుంబాలకు ఉచిత కరెంటు ఇచ్చామని, లక్ష 26 వేల కుటుంబాలకు 500 గ్యాస్ కనెక్షన్ అందించామని , 900 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టామని దానికి 57 వేల కోట్లు లబ్ధిదారుల ఖాతాలో జమ అయినట్లు చెప్పారు.

మెదక్ జిల్లా వ్యాప్తంగా 100 కోట్ల రూపాయల సబ్సిడీని మహిళల ప్రయాణం ద్వారా ఆర్టీసీ కి అందించామన్నారు. 21 కోట్ల వడ్డీలేని రుణాల అందించామని,రాష్ట్రంలో సమర్థవంతంగా 6 గ్యారంటీ అమలైతున్నాయని తెలిపారు. ఒకప్పుడు మహిళలు బ్యాంకులకు వెళ్లాలన్న ఇబ్బంది పడే వారిని, కానీ ఇప్పుడు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఏర్పాటై ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తుండడంతో ఆడపడుచులు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. మహిళలు వివిధ వృత్తులు, వ్యాపారాలకు సంబంధించి ప్రావీణ్యం పొందేలా మెదక్ త్వరలోనే మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుచేస్తున్లు పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వారికి ఉచిత బస్సు ప్రయాణ అమలులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళుతున్నట్లు చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మహిళా సంఘాల సభ్యులందరూ వివిధ సమావేశాలు నిర్వహించుకున్న సందర్భాల్లో ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న చీరలను ధరించాలని సూచించారు. మహిళా సంఘాల సభ్యులకే కాక తెల్ల రేషన్ కార్డు కలిగి, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపడుచుకు కూడా ఈ చీరలను అందజేయడం జరుగుతుందన్నారు.

నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చెక్కుల కోసం కోసం చాలామంది మహిళలు ఎదురు చూస్తున్నారని, ప్రతినెల మంత్రి నియోజకవర్గంలో వచ్చి ఇస్తే ఇంకా సంతోషంగా ఉంటుందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం వర్షానికి నానిపోయి నల్లగా మారిందని నల్లగా మారిన ధాన్యాన్ని కొని డబ్బులు రైతుల ఖాతాలో వెయ్యాలన్నారు. సన్నాళ్లకు బోనస్ ఇవ్వాలని, కొంతమంది రైస్ మిల్లర్లు దొ దొడ్డు ధాన్యం కొంటలేరని, పంట నష్టం జరిగిన చోట ఎకరానికి 25 వేల రూపాయలు ఇవ్వాలని, నర్సాపూర్ నియోజకవర్గానికి సాగు జలాల కోసం సింగూరు నీరు అందించాలని, గ్రామాల్లో తండాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయని వాటిని మరమ్మతులు చేయించాలని మంత్రి కి విన్నవించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తుండడంతో ఆయా గ్రూపులకు బ్యాంకుల ద్వారా లక్షల వరకు కూడా వడ్డీ లేని రుణాలు అందిస్తుండడం గర్వకారణం అన్నారు. ఈ రుణాలతో ఆయా సంఘాల సభ్యులు వివిధ వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఎదగడం సంతోషకరమన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగించడంతో అక్కడ కూడా వారు సంపాదించుకునే అవకాశం కలిగిందన్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్తు వినియోగించే కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించడం, గ్యాస్ సబ్సిడీ చెల్లిస్తుండడం, ఉచిత బస్సు సౌకర్యం వంటి అనేక సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడంతో జిల్లాలో వీటి నిర్మాణం వేగవంతం చేసినట్లు చెప్పారు.ఒక్క గుడిసెలేని గ్రామాలే లక్ష్యంగా ప్రభుత్వం పేదలందరికీ పక్కా గృహాలు నిర్మిస్తోందన్నారు. అనంతరం ఎమ్మెల్యే , కలెక్టర్ తో కలసి పలువురు మహిళలకు ఇందిరమ్మ చీరలను, కళ్యాణ లక్ష్మి చెక్కులను, షాది ముబారక్ చెక్కులను అందజేశారు.

Next Story