మాట ఇచ్చే..నిలబెట్టే..!

by Nallavelli.Anjaneyulu |

జగ్గారెడ్డి మాట అంటే మాట అన్నట్టుగా చిన్నారులకు విడతల వారీగా ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నారు.

మాట ఇచ్చే..నిలబెట్టే..!
X

దిశ, సంగారెడ్డి : జగ్గారెడ్డి మాట అంటే మాట అన్నట్టుగా చిన్నారులకు విడతల వారీగా ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నారు. తాజాగా శనివారం మరో 210 మందికి ఆయన సైకిళ్లను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 400 మంది చిన్నారులకు సైకిళ్లను అందజేశారు. చిన్నారుల్లో ఉత్సాహం, ఆరోగ్యం, చదువు పట్ల ఆసక్తి పెంచడమే లక్ష్యంగా జగ్గారెడ్డి ఈ కార్యక్రమం చేపడుతున్నారు. స్థానిక పీఎస్సార్ గార్డెన్ లో ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం నిర్వ‌హించారు. ప్రతీ ఒక్క చిన్నారికి జగ్గారెడ్డి స్వయంగా సైకిల్ అందజేశారు. ఐదు సంవత్సరాలు మొదలుకుని 15 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు అందజేశారు.

గత వారం టోకెన్లు ఇచ్చిన వారికి శనివారం అందుకు సంబంధించిన సైకిళ్ళు పంపిణీ చేశారు. టోకెన్ లు లేని చిన్నారులకు మరోసారి సైకిల్ లు పంపిణీ చేసేందుకు వీలుగా అందరి ఆధార్ కార్డు, పేరెంట్స్ ఫోన్ నెంబర్స్ తో కూడిన వివరాలు తీసుకోవాలని జగ్గారెడ్డి నిర్వాహకులకు సూచించారు. సైకిళ్ళు రాని చిన్నారులు ఎవరు ఆందోళన పడవద్దని, పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ సైకిళ్ళు పంపిణీ చేస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. దీంతో అక్కడ ఉన్న చిన్నారులు ఆయనకు థ్యాంక్స్ చెబుతూ ఎంతో మురిసిపోయారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, నాయకులు కూన సంతోష్, మహేష్, సుదీప్ పాల్గొన్నారు.

Next Story