- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మారనున్న రాజకీయ ముఖచిత్రం
హెచ్ఏంసీ పునర్విభజనతో పటాన్ చెరు రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది.పటాన్ చెరు నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ కి సంబంధించి గతంలో మూడు డివిజన్ లు ఉండగా ఆ సంఖ్య ప్రస్తుతం తొమ్మిదికి చేరింది

దిశ, పటాన్ చెరు: జీహెచ్ఏంసీ పునర్విభజనతో పటాన్ చెరు రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది.పటాన్ చెరు నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ కి సంబంధించి గతంలో మూడు డివిజన్ లు ఉండగా ఆ సంఖ్య ప్రస్తుతం తొమ్మిదికి చేరింది. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న మూడు మున్సిపాలిటీలను గ్రేటర్ లో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. గ్రేటర్ హైదరాబాద్‌లో పునర్విభజన ప్రక్రియ చేపట్టి విలీనమైన 27 మున్సిపాలిటీ లతో కలిపి మొత్తం 300 డివిజన్లను నూతనంగా ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి మంగళవారం సాయంత్రం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
పటాన్ చెరులో తొమ్మిది డివిజన్‌లుపటాన్ చెరు నియోజకవర్గంలో పునర్విభజనకు ముందు పటాన్ చెరు, రామచంద్రపురం, భారతి నగర్ మూడు డివిజన్‌లు ఉండగా ఇటీవల జీ హెచ్ ఎం సీ లో విలీనమైన మూడు మున్సిపాలిటీలతో కలిపి పునర్విభజన తర్వాత డివిజన్ ల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. పటాన్ చెరు పట్టణంలో గతంలో ఒక డివిజన్ ఉండగా జేపీ నగర్ పేరుతో మరొక డివిజన్ ను నూతనంగా ఏర్పాటు చేశారు. విలీన మున్సిపాలిటీలలో అమీన్ పూర్ నుంచి అమీన్ పూర్, సుల్తాన్ పూర్ రెండు డివిజన్లు, తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి తెల్లాపూర్, ముత్తంగి, బొల్లారం నుంచి బొల్లారం డివిజన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అనుకున్నదోక్కటీ.. అయ్యిందొక్కటీగ్రేటర్ హైదరాబాద్ డివిజన్ల పునర్విభజనతో పటాన్ చెరు డివిజన్ నుంచి కొత్తగా జేపీ నగర్ పేరుతో మరొక డివిజన్ ఏర్పడడంతో మరొకరికి కార్పొరేటర్‌గా పట్టణం నుంచి ఇద్దరికి అవకాశం వస్తుండడంతో పట్టణ నాయకులు సంతోషంగా ఉన్నారు. అయితే అతి పెద్ద మున్సిపాలిటీలుగా ఉన్న అమీన్ పూర్, తెల్లాపూర్ లలో రెండు డివిజన్ల చొప్పున ఏర్పాటు కావడంతో అక్కడి ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ముఖ్యంగా అమీన్ పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీలలో మూడు నుంచి నాలుగు డివిజన్లు ఏర్పడతాయని నాయకులు భావించిన డివిజన్ల సంఖ్య తగ్గడంతో పోటీకి ఆసక్తిగా ఉన్న నాయకులు షాక్ కు గురయ్యారు.
అమీన్ పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీ లతో పాటు విలీన గ్రామాలలో కార్పొరేటర్ పదవిపై డజన్ల కొద్ది నాయకులు ఆశతో ఉన్నారు. అయితే రెండు మున్సిపాలిటీల పరిధిలో నాలుగు డివిజన్లు మాత్రమే ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం నాయకులకు మింగుడుపడడం లేదు. కార్పొరేటర్ గా అవకాశం వస్తుందని భావిస్తూ క్షేత్ర స్థాయిలో పనిచేసుకుంటూ పోతే అనుకున్నదిక్కటి అయినదొక్కటి అంటూ లోలోన మథన పడుతున్నారు. అమీన్ పూర్ లో రెండు డివిజన్లు మాత్రమే ఏర్పాటు కావడంతో రిజర్వేషన్లు ఏ మేరకు అనుకూలంగా వస్తాయనే అనుమానంతో తమ రాజకీయ భవిష్యత్తు పై ఆందోళన తో ఉన్నారు.
డివిజన్ల సంఖ్యను పెంచాలి: కృష్ణ మాజీ కౌన్సిలర్అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిని రెండు డివిజన్లకు కుదించడం సరికాదు. పరిపాలన సౌలభ్యంతో పాటు విస్తీర్ణంతో పాటు జనాభా పెరుగుదల అధికంగా ఉన్న అమీన్ పూర్ లో ఐదు డివిజన్లు ఏర్పాటు చేయాలి. హైదరాబాద్ లో పాత డివిజన్ లలో పునర్విభజన ద్వారా 20 వేల జనాభాకు సైతం డివిజన్ లను ఏర్పాటు చేస్తే సుమారు లక్ష ఓట్లకు దగ్గరగా ఉన్న అమీన్ పూర్ ను రెండు డివిజన్ లకు పరిమితం చేయడం అన్యాయం. వెంటనే ప్రభుత్వం స్పందించి పాలన సౌలభ్యంతో పాటు అభివృద్ధి ని దృష్టిలో పెట్టుకుని డివిజన్ల సంఖ్యను పెంచాలి.
బీరంగూడ పేరుతో డివిజన్ ఏర్పాటు చేయాలి: శశిధర్ రెడ్డిగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో డివిజన్ల పునర్విభజనలో అమీన్ పూర్ పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన డివిజన్ల సంఖ్యను పరిపాలన సౌలభ్యం కోసం పెంచాల్సిన అవసరం ఉంది. తెలంగాణలోనే ప్రసిద్ధ శైవ క్షేత్రంగా బీరంగూడ మల్లికార్జున స్వామి ఆలయం విరాజిల్లుతుంది. ప్రజలలో గుర్తింపు ఉన్న బీరం గూడ పేరుతో డివిజన్‌ను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని బీరంగూడ పేరుతో డివిజన్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ కోరుతున్నాం.
పటాన్ చెరు కేంద్రంగా జోనల్ ఆఫీస్ ఏర్పాటు చేయాలి: బీఆర్ఎస్ నేతరాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియలో కొన్ని లోపాలున్నాయి. అమీన్ పూర్‌లో రెండు డివిజన్లు మాత్రమే ఏర్పాటు చేయడం పాలన సౌలభ్య పరంగా ఇబ్బందికరం. ప్రభుత్వం అమీన్ పూర్ పరిధిలో వార్డుల సంఖ్యను పెంచడంతోపాటు జోనల్ కార్యాలయాన్ని పటాన్ చెరు కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం.
- Tags
- medak






