- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మల్కాపూర్‌లో గంజాయి చాక్లెట్ నిల్వలు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని మల్కాపూర్ గ్రామ శివారులో గల వీఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న వ్యవసాయ క్షేత్రంలో బీహార్ రాష్ట్రానికి చెందిన రాధేశ్యామ్, ప్రేమ్ కుమార్ తమ కుటుంబాలతో కలిసి కొంతకాలంగా నివాసముంటున్నారు.

దిశ, హత్నూర: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని మల్కాపూర్ గ్రామ శివారులో గల వీఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న వ్యవసాయ క్షేత్రంలో బీహార్ రాష్ట్రానికి చెందిన రాధేశ్యామ్, ప్రేమ్ కుమార్ తమ కుటుంబాలతో కలిసి కొంతకాలంగా నివాసముంటున్నారు. ఎవ్వరికి తెలియకుండా కొంతకాలంగా దౌల్తాబాద్, మల్లాపూర్, బోర్పట్ల, గుండ్ల మాచనూర్, ఉన్న పరిశ్రమల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులపను టార్గెట్ గా చేసుకుని, గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా ఎండు గంజాయి, చాక్లెట్ గంజాయి, నిల్వలు ఏర్పాటు చేసుకొని ఎవరికి తెలియకుండా విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో పోలీసులు నమ్మదగిన సమాచారంతో హత్నూర ఎస్ ఐ. సుభాష్ తన సిబ్బందితో కలిసి రాధేశ్యామ్, ప్రేమ్ కుమార్ నివాసం ఉంటున్న ఇండ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో నిర్వహిస్తున్న క్రమంలో వారి నివాసం ఉంటున్న ఇండ్లలో సుమారు 1 కేజీ గంజాయి ఎండు గంజాయి, చాక్లెట్ గంజాయి నిల్వ ఉంచిన గంజాయి లభ్యం కావడంతో పోలీసులు గుర్తించారు. అంతలో ఒకరిని అదుపులో తీసుకోగా మరొక్కరు పరారీలో ఉన్నట్లు తెలిసింది, కాగా ఎస్ఐ సుభాష్‌లు కలిసి కేసు నమోదు చేసుకొని పూర్తి దర్యాప్తు చేపట్టి వివరాలు వెల్లడిస్తామని. ఎస్సై సుభాష్ తెలిపారు.
Read More..






