భారీగా పట్టుబడ్డ నగదు

by Bhanu |

పెద్దాపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి ఎఫ్‌ఎస్‌టి అధికారులు మహేష్ కుమార్, ఏఎస్ఐ గాలయ్య, తనిఖీలు నిర్వహించగా 5లక్షల 97 వేల నగదును పట్టుకున్నారు

భారీగా పట్టుబడ్డ నగదు
X

దిశ,అల్లాదుర్గం: గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో అల్లాదుర్గం మండల పరిధిలోని గడి పెద్దాపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి ఎఫ్‌ఎస్‌టి అధికారులు మహేష్ కుమార్, ఏఎస్ఐ గాలయ్య, తనిఖీలు నిర్వహించగా 5లక్షల 97 వేల నగదును పట్టుకున్నారు. గడి పెద్దాపూర్ బ్యాంక్ ఏరియాలో బీహార్‌కు చెందిన వితిన్ రోహన్ రాజ్ నగదుతో వెళుతుండగా , ఎఫ్‌ఎస్‌టి అధికారులు తనిఖీ చేయగా 5 లక్షల 97 వేలు నగదును స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్సై శంకర్‌కు అందజేశారు. ఈ నగదు రైస్ మిల్ యజమాని బచ్చు రమేష్‌కి చెందినదిగా పోలీసులు తెలిపారు. ఎస్సై ఈ నగదును ఆర్డిఓకు డిపాజిట్ చేసినట్లు ఆయన తెలిపారు.

Next Story