నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి : సీఐటీయు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

by Ratna Kumari |

నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేసి పాత కార్మిక చట్టాలని పురుద్ధరించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు డిమాండ్ చేశారు.

నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి : సీఐటీయు రాష్ట్ర అధ్యక్షులు  చుక్కా రాములు
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేసి పాత కార్మిక చట్టాలని పురుద్ధరించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు డిమాండ్ చేశారు. బుధవారం కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, బ్లాక్ డే పిలుపులో భాగంగా సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేప‌ట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం పెట్టు బడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నిర్ణయాలు చేస్తూ నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చి కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. యూనియన్ పెట్టకుండా సమ్మె చేయకుండా వేతనాలు అడగకుండా కోడ్స్ తెచ్చాయన్నారు. ఈ కోడ్స్ రద్దు చేయాలని కార్మిక సంఘాలు సమ్మె చేసిన కేంద్ర ప్రభుత్వం బరితెగించి 2025 నవంబర్ 21న అమలుకు నోటిఫికేషన్ ఇచ్చిందని.. ఈరోజు నుంచి అమలు చేస్తామని చెబుతుంద‌ని అమలు అయితే కేంద్ర ప్రభుత్వానికి కార్మికుల సత్తా ఏంటో గుణపాఠం చెబుతామ‌ని హెచ్చరించారు.

వెంటనే నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అంగన్ వాడి ఆశ గ్రామపంచాయతీ మున్సిపల్ వివో ఏ హాస్పిటల్ కార్మికులు పోరాటం చేస్తుంటే నిర్బంధాలు పెట్టి అరెస్టులు చేయడం సరైనది కాదన్నారు. కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం.. హామీలు అమలు చేయాలని లేకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి సాయిలు, జిల్లా ఉపాధ్యక్షులు పి బాగారెడ్డి, నాయకులు సురేష్, మంజుల, ప్రసన్నారావు, పరమేశ్వర్, మోహన్ రెడ్డి, భీమ్ రెడ్డి, శ్రీధర్, అమర్ ,రమేష్,లక్ష్మి కార్మికులు పాల్గొన్నారు.

Next Story