- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాలుగు గేదెలు చోరీ
by Kema Shiva Kumar |
బర్రెల కొట్టంలో నుంచి నాలుగు బర్రెలను గుర్తు తెలియని వ్యక్తులు తస్కరించిన ఘటన నర్సాపూర్ పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది.

X
దిశ, నర్సాపూర్: బర్రెల కొట్టంలో నుంచి నాలుగు బర్రెలను గుర్తు తెలియని వ్యక్తులు తస్కరించిన ఘటన నర్సాపూర్ పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన మహమ్మద్ జమీర్ గేదెల క్రయవిక్రయాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వ్యాపారంలో భాగంగా ఈనెల23 ఉదయం 6 గంటలకు మంగల్పర్తికి వెళ్లి మూడు దేగెలను కొనుగోలు చేసి నర్సాపూర్ లోని ఈద్గా దగ్గరలో ఉన్న తన బర్రెల కొట్టంలో తన బంధువుల గేదెతో కలిపి కట్టేశాడు. ఉదయం కొట్టం వద్దకు వెళ్లి చూడగా నాలుగు గేదెల కనిపించలేదు. అనంతరం గేదెలను దొంగలు ఎత్తుకెళ్లి ఉంటారని గ్రహించి నరసాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు.
Next Story






