- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన మాజీ ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి దంపతులు
తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి దంపతులు తమ 60వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిసి జ్ఞాపిక అందజేశారు.

దిశ, రామచంద్రాపురం : తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి దంపతులు తమ 60వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిసి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు భూపాల్ రెడ్డి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరు దశాబ్దాలుగా ఆదర్శవంతమైన దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్న భూపాల్ రెడ్డి దంపతులు ఆయురారోగ్యాలతో, ఆనంద సంతోషాలతో మరెన్నో సంవత్సరాలు జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం జరిగిన ఆత్మీయ సమావేశంలో భూపాల్ రెడ్డి కుటుంబం తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీ బలోపేతం వరకు అందించిన సేవలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. పార్టీ పట్ల వెన్నవరం కుటుంబం చూపించిన అంకితభావం, విధేయత ప్రశంసనీయమని పేర్కొన్నారు. భవిష్యత్‌లో వెన్నవరం కుటుంబానికి తగిన రాజకీయ ప్రాధాన్యం, సముచితమైన స్థానం కల్పించేందుకు పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పలు రాజకీయ, సామాజిక అంశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో, పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ చార్జి ఆదర్శ్ రెడ్డి భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.






