మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి: మాజీ హోంశాఖ సహాయ మంత్రి

by Kodari Anjali |   (  Updated:2026-04-25 12:23:57  IST  )

మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి సాధ్యమని మాజీ హోంశాఖ సహాయ మంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు అన్నారు.

మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి: మాజీ హోంశాఖ సహాయ మంత్రి
X

దిశ, కొనరావుపేట: మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి సాధ్యమని మాజీ హోంశాఖ సహాయ మంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు అన్నారు. శనివారం స్వగ్రామం నాగారంలోని జీఎం ఆర్ లక్ష్మీ ఫౌండేషన్ లో శిక్షణ పూర్తి చేసిన వారికి అందించే సర్టిఫికెట్ల ప్రధాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగర్ జీ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, వేసే ప్రతి అడుగు ఇతరులకు ఆదర్శంగా మారాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ మేనేజర్ మొయ్య మహేష్, ప్రతిమ ఫౌండేషన్ గీతారెడ్డి, కౌశిక్, రాజిరెడ్డి, ఫౌండేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Next Story