- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కేసీఆర్ లేకపోతే తెలంగాణే లేదు’: మాజీ మంత్రి హరీశ్ రావు
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించడం వల్లే దశాబ్దాల తెలంగాణ కల సాకారమైందని మాజీ మంత్రి అన్నారు.

దిశ, కొండపాక: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించడం వల్లే దశాబ్దాల తెలంగాణ కల సాకారమైందని, కేసీఆర్ లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రమే ఉండేది కాదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఆదివారం కొండపాక మండలం దుద్దెడ గ్రామంలోని చౌడాలమ్మ దేవాలయ వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు హాజరైన ఆయనకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీ మైలురాయిని చేరుకుంటున్న తరుణంలో రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నాలుగు కోట్ల ప్రజలను ఏకం చేసి, అసాధ్యమనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు...
బీఆర్ఎస్ పుట్టడం వల్లే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో స్వయంపాలనలో ఉన్నారు. మన సిద్ధిపేట జిల్లా ఏర్పడిందన్నా, కాళేశ్వరం జలాలు మన బీడు భూములను ముద్దాడుతున్నాయన్నా అది కేసీఆర్ దూరదృష్టి వల్లే సాధ్యమైంది అని ఆయన పేర్కొన్నారు. గతంలోనే కేసీఆర్ దుద్దెడ ప్రజల అవసరాల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 30 లక్షలు మంజూరు చేశారని హరీశ్ రావు గుర్తు చేశారు. చౌడాలమ్మ ఉత్సవాల నిర్వహణకు తన వంతుగా ఆర్థిక సాయాన్ని అందజేసిన ఆయన, అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుండెల్లి ఆంజనేయులు తదితరులు ఉన్నారు.






