నాదులాపూర్ చెరువులో చేపలు మృతి

by Disha Web Desk 1 |
నాదులాపూర్ చెరువులో చేపలు మృతి
X

రెండు రోజల వ్యవధిలో 4 వేలకు పైగా చేపల మృత్యువాత

ఆందోళనలో మత్స్యకారులు

దిశ, ఆందోల్: మండల పరిధిలోని నాదులాపూర్ గ్రామ పటేల్ చెరువులో గత రెండు రోజులుగా చేపలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో గ్రామ మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. గురువారం మధ్యాహ్నం రెండు వేల వరకు చేపలు నీళ్ల పైకి తేలడంతో వాటిని మత్స్యకారులు తీసివేశారు. శుక్రవారం ఉదయం కూడా సుమరుగా మరో రెండు వెలకు పైగా చేపలు వరకు నీటిపైకి తేలాయి. దీంతో ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితుల్లో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విషయాన్ని మత్స్యశాఖ అధికారులకు తెలిపినా.. వారెవరూ స్పందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం చెరువులోని నీటిని పరీక్షించేందుకు కావాల్సిన నీటిన సంగారెడ్డి మత్స్యశాఖ కార్యాలయానికి తీసుకువాలని చెప్పడంతో గ్రామ మత్స్యశాఖ అధ్యక్షులు రాజు, మరి కొంతమంది మధ్యాహ్నం సంగారెడ్డికి నీటిని తీసుకొని వెళ్లారు. చెరువులో ఎవరైనా విష ప్రయోగం చేశారా.. లేక ఏవైనా కలుషిత నీరు చేరి చేపలు మృత్యువాత పడ్డాయా అనే విషయం అధికారుల విచారణతో బయటపడే అవకాశం ఉంది.

Next Story

Most Viewed