- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫజుల్ రహ్మాన్ సేవలు చిరస్మరణీయం : మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ గడ్డపై సీనియర్ జర్నలిస్ట్ మహ్మద్ ఫజుల్ రహ్మాన్ వేసిన ముద్ర ఎన్నటికీ చెరిగిపోదని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు.

దిశ, హుస్నాబాద్ : హుస్నాబాద్ గడ్డపై సీనియర్ జర్నలిస్ట్ మహ్మద్ ఫజుల్ రహ్మాన్ వేసిన ముద్ర ఎన్నటికీ చెరిగిపోదని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. సోమవారం హుస్నాబాద్‌లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో స్ఫూర్తి అసోసియేషన్, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫజుల్ రహ్మాన్ సంతాప సభకు ముఖ్యఅతిథిగా హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుండి ఫజుల్‌తో తనకు విడదీయలేని అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. క్యాన్సర్ వ్యాధితో ఆయన మరణించడం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన స్మారకార్థం ప్రతి ఏటా 'ఉత్తమ జర్నలిస్టు అవార్డు' అందజేస్తామని, ఇందుకోసం అవసరమైన నిధులను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. విద్యావేత్తగా 'హుస్నాబాద్ పబ్లిక్ స్కూల్' ద్వారా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారని, 'హుస్నాబాద్ సలాం' పేరిట ఈ ప్రాంత చరిత్రను ప్రపంచానికి చాటారని కొనియాడారు. క్యాన్సర్‌కు ప్రధాన కారణమవుతున్న ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడమే ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, స్థానిక నేతలు, జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






