కొనుగోలు కేంద్రాల్లో చేతివాటం.. రైతులు రాస్తారోకో

by Ratna Kumari |

కొనుగోలు కేంద్రాలలో చేతివాటం చూపిస్తున్నారని రైతులు శుక్రవారం మెదక్ -చేగుంట రోడ్డు పై రాస్తారోకో నిర్వ‌హించారు.

కొనుగోలు కేంద్రాల్లో చేతివాటం.. రైతులు రాస్తారోకో
X

దిశ‌, చిన్నశంక‌రంపేట : కొనుగోలు కేంద్రాలలో చేతివాటం చూపిస్తున్నారని రైతులు శుక్రవారం మెదక్ -చేగుంట రోడ్డు పై రాస్తారోకో నిర్వ‌హించారు. చిన్నశంకరంపేట మండలం గవ్వల పల్లి గ్రామంలోని కొనుగోలు కేంద్రం వ‌ద్ద‌కు దాదాపు 20 రోజుల కిందట వరి ధాన్యం తీసుకువచ్చామని, నిర్వాహకులు ధాన్యం కొనుగోలులో చేతివాటం చూపిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వెనుక వచ్చిన వడ్లను అక్కడి నిర్వాహకులు కాంటా పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎండ వేడిమి కి తట్టుకొని అక్కడే పడుకొని ఉంటే తమ ధాన్యాన్ని కాదని ఇతరుల ధాన్యం ఎలా పెడతారని రైతులు నిలదీశారు. సమాచారం అందుకున్న ఎస్సై శివానందం తన సిబ్బంది పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఆందోళనకారులతో మాట్లాడి శాంతింప చేశారు.

Next Story