ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు.

by Taduka Kalyani |

రైతులకు కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు.
X

దిశ, చిన్నకోడూరు : రైతులకు కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం మండల పరిధిలోని గోనపల్లి పెద్ద కోడూరు వడ్ల కొనుగోలు కేంద్రాలను అకస్మాత్తుగా తనిఖీ చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు తమ ధాన్యాన్ని వ్యవసాయ పొలాల వద్దనే ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో గన్ని బ్యా గ్స్, తేమ శాతాన్ని పరిశీలించే పరికరాలు, అకాల వర్షానికి రైతులకు అందుబాటులో పాలిథిన్ కవర్లు, రైతులకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని ఐకెపి అధికారం ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐకెపి అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

Next Story