- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూరియా కోసం రైతులు బారులు.. కూపన్ల కోసం గంటల తరబడి నిరిక్షణ
యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. శుక్రవారం ఉదయం 7 గంటల నుండి గంటల తరబడి రైతులు తమ పాసుబుక్‌లను క్యూ లైన్‌లో హకా కేంద్రం వద్ద పెట్టారు.

X
దిశ, జగదేవపూర్: యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. శుక్రవారం ఉదయం 7 గంటల నుండి గంటల తరబడి రైతులు తమ పాసుబుక్‌లను క్యూ లైన్‌లో హకా కేంద్రం వద్ద పెట్టారు. మండల కేంద్రంలోని హకా కేంద్రానికి 500 బస్తాలు యూరియా వచ్చింది. ఆ విషయం తెలుసుకున్న మండలంలోని రైతులు పెద్ద ఎత్తున హకా కేంద్రానికి చేరుకొని క్యూలో పట్టా పాస్ పుస్తకాలు పెట్టి యూరియా బస్తాల కోసం సుమారు 200 మంది రైతులు నిరీక్షించారు. యూరియాను సకాలంలో రైతులు అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూడాలని రైతులు వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి వసంతరావు మాట్లాడుతూ.. రైతులు యూరియా కోసం ఆందోళన చేందవద్దని సూచించారు. మండల కేంద్రంలో ఐదు వందల బస్తాలు యూరియా అందుబాటులో ఉందన్నారు.
Next Story






