- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూరియా కోసం రైతుల ధర్నా.. గజ్వేల్ పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయం
by Nalla Sampath Reddy |
మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.

X
దిశ, సిద్దిపేట ప్రతినిధి: మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. యూరియా వెంటనే పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ, కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో గజ్వేల్ పట్టణం నుంచి తూప్రాన్ వైపు వెళ్లే రహదారిలో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌కు అంతరాయం నెలకొంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని రైతులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అన్నదాతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. యూరియా అందించే వరకు ధర్నా విరమించేది లేదని అన్నదాతలు తేల్చి చెప్తున్నారు.
Next Story






