- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గౌరారం కెనాల్ వద్ద రైతుల ధర్నా..
by Kodari Anjali |
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం కెనాల్ వద్ద సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన చేపట్టారు.

X
దిశ, వర్గల్: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం కెనాల్ వద్ద సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపిన బీఆర్ఎస్ సర్పంచ్ కనకరాజు గౌడ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎండాకాలంలో కూడా పుష్కలంగా నీరు అందించి రైతును రాజు చేశారని వెల్లడించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి సంగారెడ్డి కెనాల్‌కు వారం రోజుల పాటు నీటిని విడుదల చేసి, ఎండిపోతున్న పంటలను కాపాడాలని అన్నారు. లేనిపక్షంలో అన్నదాతలకు కంటతడి తప్పదని, ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Next Story






