- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు..
సహకార సంఘానికి గత 15 రోజులుగా యూరియా రావడం లేదని రైతులు ఆగ్రహంతో మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై శనివారం గంటసేపు ధర్నా నిర్వహించారు.

దిశ, కొల్చారం: కొల్చారం మండలం రంగంపేట సహకార సంఘానికి గత 15 రోజులుగా యూరియా రావడం లేదని రైతులు ఆగ్రహంతో మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై శనివారం గంటసేపు ధర్నా నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి కొల్చారం మండలంలో యూరియా డిమాండ్‌ను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలం చెందిందని, వారి నిర్లక్ష్యం కారణంగానే మండలానికి యూరియా కేటాయింపుల్లో అన్యాయం జరుగుతున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంపేట సహకార సంఘానికి యూరియా ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది అంటూ గత 15 రోజులుగా సహకార సంఘం చుట్టూ తిప్పుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ అధికారుల నుండి సరైన సమాధానం లేకపోవడంతో రైతులు మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. ధర్నా చేస్తున్న రైతుల వద్దకు డిసిఎంఎస్ ఉపాధ్యక్షులు అరిగి రమేష్, కొల్చారం మండల వ్యవసాయ అధికారి శ్వేతా కుమారి, ఏఈఓ రాజశేఖర్ గౌడ్లు చేరుకొని ఆదివారం ఉదయానికి రంగంపేట సహకార సంఘానికి కేటాయించిన ఒక లారీ యూరియాతో పాటు మరో లారీ యూరియా అదనంగా వచ్చేట్లు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.






