- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధాన్యం తరలించడం లేదని రైతులు నిరసన
గత వారం రోజులుగా వరి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడం లేదంటూ రైతులు రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేసిన సంఘటన నర్సాపూర్ పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది.

దిశ, నర్సాపూర్ : గత వారం రోజులుగా వరి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడం లేదంటూ రైతులు రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేసిన సంఘటన నర్సాపూర్ పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలకు వెళితే మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తుజాల్పూర్ గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం నర్సాపూర్ లోని అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత వారం రోజులుగా తూకం వేసిన వరి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోజుల తరబడి దాన్యం కేంద్రం వద్దే నిరీక్షించాల్సి వస్తుందని అన్నారు.
వర్షం వస్తే దాన్యం నీటి పాలవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యాన్ని తరలించిన లారీలను అన్ లోడ్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు చేసి, రైస్ మిల్లులకు తరలించాలని కోరారు. అనంతరం తహసిల్దార్ శ్రీనివాస్ అక్కడకు చేరుకొని ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకుంటామని రైతులకు సర్ది చెప్పడంతో నిరసన కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో తుజాల్ పూర్ గ్రామ రైతులు పాల్గొన్నారు.






